Gopichand Malineni : NBK107 కూడా కాపీయేనా ?

దర్శకుడు గోపీచంద్ మలినేని కెరీర్ ప్రారంభం నుండి మాస్ సినిమాలే చేస్తున్నాడు. అయితే గోపీచంద్ తెరకెక్కించే సినిమాల్లో ఓన్ మార్క్ కనిపించదు. వి.వి. వినాయక్ మార్క్ లేదా శ్రీను వైట్ల మార్క్ అన్నట్టు ఉంటాయి. ‘డాన్ శీను’ ‘బాడీ గార్డ్’ ‘బలుపు’ ‘పండగ చేస్కో’ ‘విన్నర్’ ఈ సినిమాలన్నిటిలో మరో డైరెక్టర్లు చేసిన సినిమా ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే రవితేజ తో తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమాతో గోపీచంద్ ఫార్మాట్ మార్చాడు అని అనుకున్నారు.

కానీ, అది కూడా విజయ్ సేతుపతి నటించిన ‘సేతుపతి’ సినిమాలా ఉందని తెలిసిపోయింది. ఆ సినిమాకే చిన్న చిన్న మార్పులు చేసి వడ్డించాడు అని అంతా అంటుంటారు. తెలుగులో కూడా ఆ సినిమా డబ్ అయ్యింది. కానీ జనాలు ఎక్కువ శాతం చూడకపోవడంతో ‘క్రాక్’ కు మరింత ప్లస్ పాయింట్ అయ్యింది.

ఇదిలా ఉండగా, గోపీచంద్ మాలినేని ప్రస్తుతం బాలయ్య తో NBK107 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గోపీచంద్ గత సినిమాలు చూసి నందమూరి ఫ్యాన్స్ లో ఓ ఆందోళన స్టార్ట్ అయిందట. ఈ సినిమా విషయంలో కూడా మళ్ళీ పాత పద్దతిని అనుసరిస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే ఈ చిత్రం టీజర్ చూస్తే మొత్తం బోయపాటి స్టైల్ లో కనిపిస్తుంది. మరో పక్క ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది అని వినికిడి.
మొత్తంగా పరిశీలిస్తే, వినాయక్, బాలయ్య కాంబోలో వచ్చిన ‘చెన్నకేశవ రెడ్డి’ స్టైల్ లో ఉంటుందని సమాచారం.

- Advertisement -

NBK107 లో సిస్టర్ సెంటిమెంట్ ను కాస్త కొత్తగా చూపిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలయ్య సరిపోయే మాస్ ఎలివేషన్స్ ను జోడిస్తున్నట్టు వినిపిస్తోంది. అదేంటో కానీ, ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, దీనికి కల్ట్ ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. అందుకే దాని క్రేజ్ ను గోపి వాడుకోవాలి అనుకుంటున్నాడేమో. ఇక ఈ మూవీలో బాలయ్య చెల్లెలుగా వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు