Godse Trailer : పొలిటికల్ టచ్ తో గాడ్సే

సత్యదేవ్, విభిన్న కథలతో సినిమాలు చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరోకు మొదట్లో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా, పెద్దగా పేరు మాత్రం రాలేదు. కానీ, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన “బ్లఫ్ మాస్టర్”, నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య” లాంటి సినిమాలతో కారెక్టర్ ఆర్టిస్టు నుండి మంచి హీరోగా ఎదిగాడు.

సత్యదేవ్ నటించిన తాజా సినిమా “గాడ్సే”. గోపి గణేష్ పట్టాబి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి నెలలోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను ఈ నెల 17న థియేటర్స్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. దానికి అనుగుణంగా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. “సత్యమేవ జయతే అంటారు. ధర్మో రక్షతి రక్షత: అంటారు. కానీ, సమాజంలో సత్యం, ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవడం లేదు”. అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్స్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆసక్తిని పెంచుతుంది. “అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడే పార్లమెంట్ లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి. సభ్యత ఉన్నోడే సర్పంచ్ కావాలి”. అని చెప్పే డైలాగ్స్ తో ప్రస్తుతం పొలిటికల్ వ్యవస్థలో ఉన్న తప్పులను ఎత్తి చూపే సినిమా అని అర్థమవుతుంది.

- Advertisement -

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా, ఈ “గాడ్సే” సినిమా కాస్త భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయని చెప్పొచ్చు. ఈ నెల 17న విడుదల అవుతున్న ఈ చిత్రం, రానా-సాయి పల్లవి “విరాట పర్వం” సినిమాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు