Godfather : మెగా ట్రీట్

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల ముందు ఫస్ట్ లుక్ కానీ, టీజర్ గానీ, ట్రైలర్ గానీ రిలీజ్ సాధా సీదాగా జరుపుకునే వాళ్లు. లేదా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేసేవారు. కానీ, ప్రస్తుతం ఓ అతిథి సమక్షంలో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముందు ఓ పోస్టర్, టీజర్ ముందు గ్లింప్స్, ట్రైలర్ ముందు ట్రైలర్ గ్లింప్స్ విడుదల చేస్తున్నారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాకు కూడా ఇదే చేస్తున్నారు.
మెగా 153వ సినిమా మోహన్ రాజా దర్శకత్వంలో తెరెక్కుతుంది. దీనికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. మోహన్ లాల్ మలయాళ లో నటించిన లూసిఫర్‌ కు ఇది తెలుగు రిమేక్ అని తెలిసిందే. ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో మూవీ టీం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది.

ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి ఫస్ట్ లుక్ జూలై 4 సాయంత్రం 5.45 గంటలకు విడుదల కానుంది. సినిమా ఫస్ట్ లుక్ తేదీ మరియు సమయం ఉన్న పోస్టర్ మేకర్స్ అధికారికంగా ప్రటించారు.

- Advertisement -

“మెగా మెనాసింగ్ అరైవల్ ఆఫ్ ది గాడ్‌ఫాదర్‌ కి దారి తీయండి” అంటూ ఈ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. వర్షంలో ఎన్నో నలుపురంగు గొడుగుల మధ్య ఒక ఎరుపు రంగు గొడుగు కనిపిస్తుంది. మెగాస్టార్ ఫస్ట్‌లుక్‌ను చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. స్టార్ నటీనటులు నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ లో ఎన్. వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు