Godfather : మెగా మూవీలో మెగా పొరపాటు

మెగాస్టార్ చిరంజీవి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ కాస్త స్ట్రాంగ్ గానే ఇచ్చాడు. కానీ, మెగా ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో సినిమాలు ఉండటం లేదని అంగీకరించలేని సత్యం. ‘ఖైదీ నెంబర్ 150’ మెగాస్టార్ ల్యాండ్ మార్క్ సినిమా కాబట్టి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అలాగే ఠాగూర్ లాంటి హిట్ ఇచ్చిన వినాయక్ దర్శకుడు ఉండటం. అన్నిటికీ తమళంలో ఎన్నో రికార్డులను నమోదు చేసిన సినిమాకు రీమేక్ కావడం. అలాగే సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది.
దీని తర్వాత వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం గట్టెక్కలేకపోయింది. ‘ఆచార్య’ సంగతి ఇక చెప్పనవసరం లేదు. ఆ సినిమా తెచ్చిన నష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీంతో ప్రస్తుతం టైం బాలేదు అని చిరు బలంగా నమ్ముతున్నారు అంటూ సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి.

దాని కోసం చిరు న్యూమరాలజీ వద్దకు వెళ్లాడని, పేరును మార్చుకున్నాడని వార్తలు వచ్చాయి.
సాధారణంగా చిరంజీవి పేరు ఇంగ్లీష్ లో “CHIRANJEEVI” ఇలా ఉంటుంది. కానీ తాజాగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ లో “CHIRANJEEEVI” గా వేశారు. ఇందులో ఒక ‘E’ అక్షరం ఎక్కువగా ఉంది. దీంతో న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుంటే సినిమా సక్సెస్ అవుతుంది అనే సెంటిమెంట్ ని చిరు ఫాలో అయ్యారు అనేది ఆ వార్తల సారాంశం. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. అది కేవలం పొరపాటు మాత్రమే అని చిత్ర బృందం తేల్చేసింది. దాంతో ఆ కథనాలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది. అయితే ఫస్ట్ లుక్ దగ్గరే ఇలాంటి పొరపాటు జరిగితే సినిమాలో ఇంకెన్ని పొరపాటులు జరిగుంటాయో, అనే నెగిటివ్ కామెంట్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులోనూ ఫస్ట్ లుక్ మెగా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దర్శకుడు మోహన్ రాజా కూడా 20 ఏళ్ళ క్రితం తెలుగులో సినిమా చేశాడు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు చాలా మారారు. మరి వాళ్ళను మెప్పించేలా తీసాడో, నొప్పించేలా తీసాడో అన్నది సినిమా చూస్తే కాని చెప్పలేము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు