God Father: హైలెట్ సీన్స్ అవే

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ ‘లూసిఫర్’ కు ఇది రీమేక్ కావడం విశేషం.దసరా కానుకగా విజయదశమి రోజు నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఈ మధ్యనే మేకర్స్ ఫస్ట్ లుక్ ద్వారా వెల్లడించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హీరో సత్యదేవ్,అనసూయ, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హైలెట్ సీన్స్ ఇవే అంటూ ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఆ చర్చల ప్రకారం చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయట.అవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఉన్నట్టు కాకుండా డిఫరెంట్ గా డిజైన్ చేశారట.సినిమా ప్రారంభమయ్యే మొదటి 15 నిమిషాలు, అలాగే క్లైమాక్స్ హైలెట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. ఈ చిత్రంలో పొలిటికల్ టచ్ కూడా ఉంటుంది. ఆ సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలుస్తాయి అని టాక్. మలయాళం వెర్షన్ తో పోలిస్తే తెలుగు వెర్షన్ కు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అనేది స్పష్టమవుతుంది.’ఆచార్య’ ఫలితంతో నిరాశ చెందిన మెగా ఫ్యాన్స్ ‘గాడ్ ఫాదర్’ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు