Ghajini : హీరోయిన్ ఆసిన్ డైవర్స్ తీసుకోబోతుందా.. !

హీరోయిన్ ఆసిన్ డైవర్స్ న్యూస్ గత కొద్దిరోజులుగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నఆసిన్ ఇటీవలనే ఆమె ఇంస్టాగ్రామ్ లో వీరిద్దరి మ్యారేజ్ పిక్స్ ని డిలీట్ చేయడంతో అందరికి అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. మరో హీరోయిన్ డైవర్స్ తీసుకోబోతుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి,

రవితేజ హీరోగా నటించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన ఆసిన్, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకి గాను ఆమె ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆమె మొదటి సక్సెస్ ను ఇచ్చింది. ఇక ఆ తరువాత నుంచి బిజీ హీరోయిన్ గా మారిన ఆసిన్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాలలో నటించింది.

ఈమె హీరోయిన్ గా నటించిన తమిళ్ గజిని సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ అవడంతో ఆ సినిమాని హిందీ రీమేక్ చేసారు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆసిన్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ సమయంలోనే రాహుల్ శర్మతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ప్రస్తుతం వీరిద్దరికి ఒక పాపా కూడా ఉంది.

- Advertisement -

పెళ్లి తరువాత సినిమాలు చేయడం తగ్గించేసిన ఆసిన్ ఆమె భర్తతో కలిసి ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. ఈ తరుణం ఆమె తన సోషల్ మీడియాలో ఎకౌంట్ లో అనుకోకుండ మ్యారేజ్ పిక్స్ డిలీట్ చేయగా, వీరిద్దరూ డైవర్స్ తీసుకోబోతున్నారనే న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అయితే వెంటనే ఆమె ఈ వార్తపై స్పందించి అలాంటిదేమి లేదు, నేను నా భర్తతో చాలా సంతోషంగా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వ్యవహారం సద్దుమణిగింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు