Pushpa : సుకుమార్ వదలడా ?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఫోకస్ మొత్తం పుష్ప సీక్వెల్ పైనే పెట్టాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ ఎన్నో సంచలాలను సృష్టించింది. భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు పుష్ప సినిమాలోని డైలాగ్స్, డ్యాన్స్, పాటలను ఆదరించారు. తగ్గేదేలే అనే డైలాగ్ కొన్ని నెలల పాటు సోషల్ మీడియాను ఊపేసింది.

దీంతో పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. పుష్ప పార్ట్ 1కు మించిన మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఎప్పటి నుండో ఒక డౌట్ ఉండేది. పుష్ప పార్ట్ 2 తర్వాత ఏంటి అని. సుకుమార్ వేరే సినిమాలు చేస్తాడా, లేదా పుష్ప ఫ్రాంచైజ్ కొనసాగిస్తాడా అనేదే డౌట్. ఎట్టకేలకు ఈ డౌట్ పై ఓ క్లారిటీ వచ్చింది.

మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పుష్ప ఫ్రాంచైజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాహద్ ఓ ఇంటర్వ్యూ లో, పుష్ప పార్ట్ 3 ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ తనతో చెప్పాడంటూ కామెంట్ చేశాడు. దీంతో పుష్ప మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. నిజంగానే పుష్ప పార్ట్ 3 ఉంటే బన్ని ఫ్యాన్స్ కు పండగ వాతావరణం ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు