Exclusive: గుంటూరు కారం స్టోరీ లీక్… త్రివిక్రమ్ – మహేష్ పొలిటికల్ ప్లాన్?

తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఈ ప్రభావం తెలుగు సినిమా ఇండస్ట్రీపై కూడా పడుతుంది. ఈ పొలిటికల్ హీట్ ని క్యాచ్ చేసుకోవడానికి డైరెకర్లు రెడీ అవుతున్నారు. అందుకు పొలిటికల్ నేపథ్యంలోని కథలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ… తన వ్యూహాన్ని వదులుతున్నాడు. ఇప్పుడు అనూహ్యంగా త్రివిక్రమ్ కూడా పొలిటికల్ ప్లాన్ తో వస్తున్నాడు.

మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమా స్టార్ట్ అయి చాలా రోజులు అవుతుంది. కానీ, ఇప్పటి వరకు సినిమా గురించి గానీ, స్టోరీ గురించి గానీ, ఎలాంటి క్లూ రాలేదు. కానీ, గుంటూరు కారం గురించి ఒక అదిరిపోయే లీక్ వచ్చింది.

గుంటూరు కారం అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ నేపథ్యంలోనే ఉండబోతుందట. మహేష్ బాబు నుంచి ఇప్పటికే వచ్చిన భరత్ అనే నేను అని సినిమాను పోలి గుంటూరు కారం ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది.

- Advertisement -

లీక్ అయిన స్టోరీ విషయానికి వస్తే…
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు చేస్తున్న పాత్ర పేరు వెంకటరమణ రెడ్డి. ఇతనికి తండ్రి వైర వెంకట స్వామి (ప్రకాశ్ రాజ్) జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి. రాజకీయాలు అంటే ఇష్టం ఉండని వెంకట రమణ రెడ్డి (మహేష్ బాబు) తన తండ్రి 80 పుట్టిన రోజు తర్వాత అనూహ్యం రాజకీయాల్లోకి వస్తాడు. పొలిటికల్ లోకి అడుగు పెట్టని తర్వాత శత్రువులను, రాజకీయ శత్రువులను హీరో ఎలా ఎదుర్కున్నడు అనేది మిగితా స్టోరీగా ఉండబోతుంది.

ఈ స్టోరీని బలపరుస్తూ Filmify  కి Exclusive సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి వచ్చింది. దానిలో ప్రకాశ్ రాజు కనిపిస్తున్నాడు. జన దళం పార్టీ అని, అతని పేరు వైా వెంకట స్వామి అని కనిపిస్తుంది. అలాగే జన దళం పార్టీ గుర్తుగా కాగడ కనిపిస్తుంది.

Guntur Kaaram Story Leaked
Guntur Kaaram Story Leaked

ఇదే కాగడ గుర్తూ ఇటీవల గుంటూరు కారం నుంచి విడుదలైన దమ్ మసాలా సాంగ్ లో మహేష్ కారుపై కూడా కనిపిస్తుంది. దీంతో ఈ లీక్ అయిన స్టోరీ నిజమే అని స్పష్టమవుతుంది.

Guntur Kaaram Story Leaked
Guntur Kaaram Story Leaked

అయితే త్రివిక్రమ్ ఎప్పుడూ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ స్టోరీలను తీసుకోలేదు. మహేష్ తో గతంలో చేసిన అతడు సినిమాలో కొంత వరకు పొలిటికల్ టచ్ ఇచ్చాడు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కొంత వరకు పొలిటికల్ నేపథ్యాన్ని జోడించాడు. కానీ, ఇప్పుడు గుంటూరు కారం సినిమాను మొత్తం పొలిటికల్ స్టోరీతోనే రన్ చేయబోతున్నాడు.

Guntur Kaaram Story Leaked
Guntur Kaaram Story Leaked

మహేష్ బాబుకి పొలిటికల్ స్టోరీ కొత్తేమీ కాదు. శ్రీను వైట్ల దర్శకత్వలో వచ్చిన దూకుడు సినిమాలో MLAగా కనిపించాడు. కొరటాల శివతో చేసిన భరత్ అనే నేను సినిమాలో CM లా మహేష్ కనిపించాడు. ఇప్పుడు గుంటూరు కారంలో కూడా పొలిటీషయన్‌గా కనిపించబోతున్నాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు