Singer KK : సింగర్ కేకే మరణం పై అనుమానాలు ఎన్నో?

దేశం గర్వించదగ్గ గాయకుల్లో కేకే ఒకరు. అలాంటి గాయకుడు మరణించడంతో ఇప్పుడు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేకే పూర్తి పేరు కృష్ణకుమార్ కున్నత్. ఈయన వయసు 53 సంవత్సరాలు. ఢిల్లీలో నివాసముంటున్న మలయాళీ దంపతులకు 1968లో కేకే జన్మించాడు. కెరీర్ ప్రారంభంలో ఈయన వాణిజ్య ప్రకటనలకు జింగిల్స్ పాడేవారు. ఆ టైంలో ఇతనికి ఏ.ఆర్.రెహమాన్ తో పరిచయం ఏర్పడింది. ఇతనిలోని సింగింగ్ టాలెంట్ ను గుర్తించిన రెహమాన్.. తన సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని కల్పించారు. అంతే.. దెబ్బకు టాప్ సింగర్ల లిస్ట్ లో చేరిపోయారు కేకే.

మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ పాటలు పాడారు కేకే. ‘ఇంద్ర’ లో దాయి దాయి దామా, ‘అతడు’ లో అవును నిజం, ‘జల్సా’ లో మే హార్ట్ ఈజ్ బీటింగ్, ‘డార్లింగ్’ లో హొస్ సాహోరే.. లాంటి హిట్ పాటలు ఆయనే పాడారు. అయితే మే 31న రాత్రి  కోల్కతాలోని నజ్రుల్ మంచా వివేకానంద కాలేజ్ లో ఓ స్టేజ్ షో ఇచ్చిన కేకే.. అనంతరం ది గ్రాండ్ హోటల్ వెళ్లిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తర్వాత అతని అసిస్టెంట్లు హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది. దీంతో కేకే మృతి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షో సమయంలో కూడా ఇతను సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు