Akhil: ఏజెంట్ విషయంలో అదే జరుగుతుందా?

అఖిల్ మొదటి సినిమా రిలీజ్ కావడానికి ముందు వరకు అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉండేవి. అక్కినేని ఫ్యామిలీకి మాస్ ఆడియన్స్ లో పెద్దగా క్రేజ్ లేదు అనే అభిప్రాయం ఎప్పటి నుండో అందరిలోనూ ఉన్నదే. నాగార్జున కొంత వరకు హ్యాండిల్ చేసి సక్సెస్ అయ్యారు. ఆయన స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత అతని కొడుకుల్ని కూడా మాస్ హీరోలను చేయాలని కలలు కన్నారు. అయితే నాగచైతన్య డెబ్యూ మూవీ కి కొన్ని తప్పులు జరిగాయి. అలాంటి తప్పులు అఖిల్ విషయంలో చేయకూడదు అనుకున్నారు. కానీ తెలీకుండానే ఇంకా ఎక్కువగా జరిగిపోయాయి.

అఖిల్ సరైన హిట్టు అందుకోవడానికి చాలా టైం పట్టింది. గత ఏడాది వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ తప్ప అఖిల్ కు కమర్షియల్ హిట్ లేదు. అంతకు ముందు ‘హలో’ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అనిపించుకోలేకపోయింది. అందుకు కారణం.. ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ జరగడం వలన.వినాయక్ దర్శకత్వంలో డెబ్యూ ఇచ్చిన అఖిల్ మొదటి మూవీ ‘అఖిల్’ కు రూ.35 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఆ మూవీ రూ.18 కోట్ల వరకు మాత్రమే ఫుల్ రన్లో కలెక్ట్ చేసింది. ఇక ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాలకు కూడా రూ.25 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగాయి. ఇందులో ‘మిస్టర్ మజ్ను’ రూ.10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా, ‘హలో’ చిత్రం రూ.20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అఖిల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని రూ.20 కోట్లకే అమ్మింది. కాబట్టి ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న ‘ఏజెంట్’ చిత్రానికి మళ్ళీ భారీ లెవెల్లో థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది అని ట్రేడ్ వర్గాల టాక్.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీని రూ.30 కోట్ల వరకు అమ్ముతున్నారట.వరల్డ్ వైడ్ గా అయితే రూ.40 కోట్లు దాటేస్తుంది. సురేందర్ రెడ్డి సినిమా కాబట్టి బయ్యర్స్ ఈ చిత్రాన్ని ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ‘అఖిల్’ మార్కెట్ ను బట్టి అయితే ఇది చాలా ఎక్కువ బిజినెస్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో విడుదలయ్యే సినిమాలు ఎంత బాగున్నా జనాలు థియేటర్ కు రావడం లేదు. బయ్యర్స్ కూడా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలని భారీ రేట్లకి కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘ఏజెంట్’ చిత్రానికి విడుదల తర్వాత నెగిటివ్ టాక్ వస్తే బయ్యర్స్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. నిర్మాతలు, బయ్యర్లు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిదని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు