సినిమా ఇండస్ట్రీలో పుకార్లు రావడం నిరంతరమైన ప్రక్రియా. కొన్ని పుకార్లు ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయి, టాలీవుడ్ నే షేక్ చేస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని నిజమవుతాయి. మరికొన్ని పుకార్లుగానే మిగిలిపోతాయి. తాజాగా ఫిల్మ్ నగర్ లో, సోషల్ మీడియాలో నిన్నటి వరకు ఓ వార్త తెగ చెక్కర్లు కొట్టింది. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న దసరా సినిమా ఆగిపోయిందని ఈ వార్తల సారాశం.
బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ ఆగిపోయిందని, సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా టైం పట్టేలా ఉందని పుకార్లు వచ్చాయి. అలాగే, డైరెక్టర్ శ్రీ కాంత్ ఓదెల చేసిన స్క్రీప్ట్ నానికి నచ్చలేదని వార్తలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ ఓదెల స్క్రీప్ట్ ను మార్చే పనిలో ఉన్నాడని కూడా పుకార్లు వచ్చాయి.
నెట్టింట్లో కూడా ఈ వార్తలు కాస్త ఎక్కువ డోస్ లోనే వచ్చాయి. అయితే, ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు దసరా సినిమా దర్శకుడు శ్రీ కాంత్ ఓదెల కాస్త ఘాటుగా స్పందించాడు. కామెడీయన్ బ్రహ్మానాందంతో ఉన్న వీడియోను పోస్టు చేసి, ఇప్పటి వరకు వచ్చిన వార్తలకు బ్రేక్ వేశాడు.
కాగా, అంటే సుందరానికి సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని చేస్తున్న సినిమా దసరా. అంటే సుందరానికి పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు పెద్దగా రాకపోవడంతో నాని తన ఫోకస్ మొత్తాన్ని దసరాపై పెట్టాడు. నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
నాని కెరీర్ లో మొదటి సారి తెలంగాణ గ్రామీణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.