Mollywood : మల్లు బ్యాచ్ కూడా నేర్చుకుందా ?

గత 5 ఏళ్లలో తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరిగింది. అప్పటివరకు బాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్ లు మాత్రమే పెద్దవి అన్నట్టు చూసేవారు. కానీ, రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరిగింది. ఇప్పుడు తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. టాలీవుడ్ ను చూసి మిగిలిన భాషల్లోని ఫిలిం మేకర్స్ కూడా పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. పక్క భాషల్లోని స్టార్ హీరోలు కూడా టాలీవుడ్ లో స్ట్రైట్ సినిమాల్లో నటిస్తున్నారు. అంత గొప్ప పేరు సంపాదించుకున్నా, ఎందుకో టాలీవుడ్ అంటే ఇంకా పక్క రాష్ట్రాల్లోని ఫిలిం మేకర్స్ కు ఎగతాళిగా ఉందా అనే డౌట్ వస్తుంది.
ఎందుకంటే వాళ్ళు తెలుగు కలెక్షన్స్ కోసం తమ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. కానీ, ఆ సినిమాలకు తెలుగు టైటిల్స్ మాత్రం పెట్టడం లేదు.

ఓ సినిమాని అన్ని భాషల్లోకి డబ్ చేస్తున్నామంటే అన్ని భాషలకు సూట్ అయ్యే ‘బాహుబలి’ ‘కె.జి.ఎఫ్’ ‘పుష్ప’ ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి టైటిల్ పెట్టుకోవాలి. లేదంటే ఏ భాషల్లోకి సినిమాను రిలీజ్ చేస్తున్నామో, అక్కడ నేటివిటీకి తగినట్టు టైటిల్ పెట్టాలి. కానీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాల టైటిల్స్ ను గమనిస్తే, ‘వలీమై’ ‘ఈటి’ ‘కన్మణి ఖటీజా రాంబో’ ఇలాంటి టైటిల్స్ పెడుతున్నారు. కోలీవుడ్ మేకర్స్ వలన ఇప్పుడు మలయాళం ఫిలిం మేకర్స్ కూడా ఇదే నేర్చుకుంటున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ మూవీ ‘కడువా’. అదే టైటిల్ తో తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది. ఈ విషయం పై అక్కడి నిర్మాతలను ప్రశ్నిస్తే, ‘తెలుగు కోసం ప్రత్యేకంగా టైటిల్ పెడితే, సోషల్ మీడియాలో ఆ హ్యాష్ ట్యాగ్ ఆశించిన స్థాయిలో ట్రెండ్ అవ్వడం లేదని’ చెబుతున్నారు. వాళ్ళకి ట్రెండింగ్ లో ఉండడం కావాలా, సినిమా హిట్ అయి కలెక్షన్లు రావడం కావాలా? అనేది అర్థం కాని పరిస్థితి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు