Koratala Siva: కాపీరైట్ చట్టం కింద క్రిమినల్ చర్యలు… ‘శ్రీమంతుడు’ డైరెక్టర్ కు షాకిచ్చిన కోర్ట్

‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కొరటాల శివకి హైకోర్టు షాక్ ఇచ్చింది. కాపీరైట్ చట్టం కింద క్రిమినల్ చర్యలు ఎదురుకోక తప్పదని ఆదేశించింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంభోలో తెరకెక్కిన హిట్ మూవీ ‘శ్రీమంతుడు’. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2017 ఆగస్టు 7న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా నూట నలభై కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. అయితే అప్పట్లో ఈ మూవీ తన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర ఆరోపించడం వివాదానికి దారి తీసింది. అప్పటినుంచి కొనసాగుతూ వస్తున్న ఈ కేసు పై తాజాగా హైకోర్టు క్రిమినల్ చర్యలు తప్పవంటూ కొత్తగా ఆదేశాలు ఇచ్చింది.

“శ్రీమంతుడు” మూవీ వేమూరి బలరాం నేతృత్వంలో నడిచే స్వాతి మాస పత్రికలో ప్రచురితమైన “చచ్చేంత ప్రేమ” అనే తన నవల ఆధారంగా తీసారంటూ రచయిత శరత్ చంద్ర ఆరోపించారు. అక్కడితో ఆగకుండా హైదరాబాదులోని క్రిమినల్ కోర్టుకి ఎక్కారు. ఎంబి క్రియేషన్స్ అధినేత, హీరో మహేష్ బాబు, మైత్రి మూవీస్ అధినేత ఎర్నేని నవీన్, దర్శకుడు కొరటాల శివపై శరత్ చంద్ర కేసు వేశారు. 1729/2017 కింద ఈ కేసుని అప్పట్లో నమోదు చేశారు. 2012లో “చచ్చేంత ప్రేమ” అనే నవల స్వాతి మంత్లీ మ్యాగజైన్ లో ప్రచురించడం జరిగిందని, అయితే తన అనుమతి లేకుండానే అదే కథ ఆధారంగా “శ్రీమంతుడు” మూవీని తెరకెక్కించారని శరత్ చంద్ర కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ కాపీరైట్స్ వివాదంలోనే పలుసార్లు మహేష్ బాబుకి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

- Advertisement -

ఈ కాపీ రైట్స్ వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన శరత్ చంద్ర కు ఊరటనిస్తూ తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది. డైరెక్టర్ కొరటాల శివ కాపీరైట్ చట్టం కింద క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు జడ్జిమెంట్ కాపీని కూడా రిలీజ్ చేసింది. ఈ ఏడాది నవంబర్ 22న జడ్జిమెంట్ కాపీ వచ్చింది. దీంతో కొరటాల శివ క్రిమినల్ కేసును ఎదుర్కోవడం అనివార్యమైంది. రచయిత శరత్ చంద్ర తరఫున “శ్రీమంతుడు” కాపీరైట్స్ కేసుని ప్రముఖ న్యాయవాది చల్లా అజయ్, రాజశేఖర్ వాదించారు. ఏదైతేనేం ఇన్ని ఏళ్ళు ఈ కేసుపై న్యాయపోరాటం చేసిన రచయిత శరత్ చంద్ర ఎట్టకేలకు విజయం సాధించడంలో సక్సెస్ అయ్యాడు. తన సైడ్ నిజాయితీ ఉండడంతో ఓపికగా ఇన్నేళ్లు వెయిట్ చేసి చివరకు తన ఆరోపణ నిజం అని ప్రూవ్ చేశాడు.

మరి ఇప్పుడు కొరటాల శివ న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆయనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటారు ?అనే విషయం తెలియాల్సి ఉంది. “శ్రీమంతుడు” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ అదే మూవీతో ఇలా కాపీరైట్ మచ్చను నెత్తి మీద వేసుకున్నాడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.M

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు