Charan-Ram : ఒకే కాన్సెప్ట్ తో చరణ్, రామ్ ?

రామ్ పోతినేని కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జూలై 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తుంది. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పాటలు బాగున్నాయి. ట్రైలర్ కూడా బాగుంది. అయితే, ఈ మధ్య కాలంలో యాక్షన్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు దూరమయ్యారు. కానీ, ఈ మూవీ ఆ లోటుని తీరుస్తుంది అని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ‘ది వారియర్’ కి, అలాగే చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న RC15 చిత్రానికి ఓ సిమిలారిటీ ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అదేంటి అంటే, ‘ది వారియర్’ లో పోలీస్ ఆఫీసర్, డాక్టర్ పాత్రలలో రామ్ పోతినేని కనిపించబోతున్నాడట. అదెలా సాధ్యమంటే, డాక్టర్ వృత్తిని కొన్ని కారణాల వల్ల వదిలేసి, పోలీస్ గా మారతాడు టాక్. అది ఎందుకు అనేది సినిమాలో చూడాలని మేకర్స్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరోపక్క చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఇలాంటి పాయింట్ ఒకటి ఉంటుంది అని వినికిడి. పోలీస్ గా ఉండే రాంచరణ్, కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలేసి కలెక్టర్ అవుతాడట. దానికి కూడా ఓ బలమైన ఎమోషనల్ పాయింట్ ను దర్శకుడు శంకర్ జోడించినట్టు తెలుస్తుంది.

ఇలా రామ్ చరణ్, రామ్ పోతినేని ఒకే రకమైన కాన్సెప్ట్ తో వస్తున్నారని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అది నిజమా కాదా అని తెలియాలంటే, ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు