Chandramukhi 2 : షూటింగ్ స్టార్ట్

సూపర్ రజిని కాంత్ సినిమాల్లో చంద్రముఖికి ప్రత్యేక స్థానం ఉంటుంది. రజిని బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇది ఒకటి. కేవలం 19 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల వరకు కొల్లగొట్టింది. అంతే కాకుండా, ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. ఈ సినిమా వచ్చిన 17 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ తెరకెక్కబోతుంది.

చంద్రమూఖి-2 లో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చంద్రముఖి 2లో లక్ష్మీ మీనన్ కథానాయిక గా నటిస్తుంది. పి. వాసు దర్శకత్వం వహింస్తున్నాడు. అలాగే, ప్రముఖ బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ హారర్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

కాగా, ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా రాఘవ లారెన్స్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. సూపర్ స్టార్ రజిని కాంత్ ను రాఘవ లారెన్స్ కలిసి, ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు. నేటి నుండి షూటింగ్ మైసూర్ లో ప్రారంభం అవుతుంది అని తెలిపాడు. దీనికి తలైవా ఆశీస్సులు కావాలంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు