RC15 : అప్పుడే అన్ని కోట్లా ?

‘శంకర్‌ అంటే గ్రాండియర్. గ్రాండియర్ అంటే శంకర్’ అన్నట్టు ఉంటాయి శంకర్ దర్శకత్వం వహించే సినిమాలు. ఈ స్టార్ డైరెక్టర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే, ఆ సినిమా నిర్మాతకు ధైర్యం బాగానే ఉండాలి. బడ్జెట్ భారీగా పెడుతుండాలి. వాటికి ఇంట్రెస్ట్ లు కూడా ఎక్కువగానే కడుతుండాలి. ఇప్పటివరకు శంకర్ సినిమాలను నిర్మించిన నిర్మాతలు అందరూ గట్టోళ్లే. ఒక్క ‘లైకా’ నిర్మాతలు మినహా, ‘ఇంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు’ అని శంకర్ ని ప్రశ్నించిన వాళ్ళు లేరు. అయితే రామ్‌చరణ్‌ తో శంకర్ చేస్తున్న సినిమా విషయంలో శంకర్ కు బోలెడన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎందుకంటే, ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు. ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఓ కథకు ఎంత బడ్జెట్ పెట్టాలి. అనేది ముందుగానే డిసైడ్ అయి రంగంలోకి దిగుతారు. RC15 సినిమాకు 200 కోట్ల బడ్జెట్ అని దిల్ రాజు ముందుగా ఫిక్స్ అయిపోయారట. కానీ శంకర్ మాత్రం దీనిని ఏమాత్రం లెక్కచేయకుండా ఇప్పటికే 250 కోట్ల వరకు తీసుకెళ్లాడు. ఈ సినిమా షూటింగ్ మరో 30 శాతం మిగిలుంది. ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.

అంటే, బడ్జెట్ మరో 50 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. దీన్ని మించి పోయినా, ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్ డైరెక్టర్‌ను శంకర్ మార్చేశాడట. రామకృష్ణ – మౌనిక ఇప్పటివరకు ఆర్ట్ డైరెక్టర్ పనిచేస్తూ వచ్చారు. వీరి ప్లేస్ లో ఇప్పుడు రవీందర్‌ ను ఎంపిక చేసుకున్నారట. షూటింగ్ ఫినిష్ అయ్యే లోపు శంకర్ ఇంకెన్ని మార్పులు చేయిస్తాడో, దానికి ఎంత బడ్జెట్ అవుతుందో అని దిల్ రాజు తెగ టెన్షన్ పడిపోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వనిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు