Bimbisara Trailer: తారక్ చేతులు మీదుగా

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు లవ్ అండ్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు పీరీయాడికల్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో “బింబిసారా” అనే సినిమాతో రానున్నాడు. ఈ చిత్రం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడి కథ. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆగస్టు 5న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. ఈ సినిమాకి కీరవాణి తో పాటు చిరంతన్ బట్ సంగీతం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ ట్రైలర్ ని కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. శిల్పకళా వేదికలో ఈవెంట్ జరుగుతుంది. అయితే తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ బేస్ వాయిస్ తో అదరగొట్టాడని చెప్పుకోవచ్చు.”హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు 50 రాజ్యాలను దాటి విస్తరించాయి. శరణు కోరితే ప్రాణబిక్ష.. ఎదిరిస్తే మరణం”ట్రైలర్ చివర్లో “జగత్ జజ్జనిక” అంటూ కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. కళ్యాణ్ రామ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ, గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు