మెగాస్టార్ చిరంజీవి నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరు తన తర్వాత సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు చిరు. అయితే దర్శకుడు మెహర్ రమేష్ తో చేస్తున్న ‘భోళా శంకర్’ చిత్రాన్ని మెగాస్టార్ పక్కన పెట్టినట్లు ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది భోళా శంకర్ చిత్ర బృందం. జూన్ 21 నుండి ‘భోళా శంకర్’ కొత్త షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నట్టు వెల్లడించింది. దీంతో ఆ ఫేక్ న్యూస్ లకి ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.
కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘వేదాలం’ చిత్రానికి రీమేక్ గా ‘భోళా శంకర్’ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరు కి చెల్లెలి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుంది. తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘ఎకె ఎంటర్టైన్మెంట్’ మరియు ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ల పై కె.ఎస్.రామారావు తో కలిసి అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక కొత్త షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు అని తెలుస్తుంది.