Balakrishna Vs NTR: ఈ దెబ్బతో ఎన్టీఆర్ ఇక నందమూరిలో కలవరా..?

Balakrishna Vs NTR.. వాస్తవానికి ఎప్పటినుంచో నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ కి మాటలు లేవన్న విషయం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది.. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య అభిమానులకు మధ్య వార్ జరుగుతూనే ఉంది.. అయితే అప్పుడప్పుడు బాలయ్య వ్యాఖ్యలతో నందమూరి కుటుంబానికి, ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం స్పష్టం అవుతూ ఉంటుంది… అయితే ఇప్పుడు బాలయ్య మరొకసారి ఎన్టీఆర్ పై ఉన్న కోపాన్ని తన మాటల ద్వారా వ్యక్తం చేయడంతో ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. మొన్న జరిగిన ఎన్నికలలో బాలయ్య చాలా రోజులుగా టిడిపి పార్టీ తరపున ప్రచారం చేశారు.. పార్టీని గెలిపించుకోవడం కోసం అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ కష్టపడి పోయారు..ఇప్పుడు తాజాగా కాజల్ చిత్రం సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు బాలయ్య.. ఈ ఈవెంట్ లోనే బాలకృష్ణ ఎన్టీఆర్ పై తనకున్న కోపాన్ని మొత్తం కక్కేశారు.

సత్యభామగా కాజల్ అగర్వాల్.

వివాహం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం సత్యభామ.. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.. జూన్ 7వ తేదీన రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం.. ఈ ట్రైలర్ ను బాలయ్య రిలీజ్ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను 40 రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి.. కెమెరాను మిస్ అయ్యాను అంటూ తెలిపారు..

ఎన్టీఆర్ పై పరోక్షంగా కామెంట్లు చేసిన బాలయ్య..

Balakrishna Vs NTR: Will NTR meet again in Nandamuri after this blow?
Balakrishna Vs NTR: Will NTR meet again in Nandamuri after this blow?

బాలయ్య మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వారసులము అని ఆయన పేరు ఒకటే చెప్పుకుంటే సరిపోదు..పైగా ఆయన సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన ఆయన వారసులు కారు అని చెప్పుకొచ్చారు.. బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడిచిన వారే ఆయన వారసులని చెప్పుకొచ్చారు.. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి చేశాడని సదరు హీరో అభిమానులు అంటున్నారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయట్లేదు.. కాబట్టి ఆయన వారసుడు కాదు అని ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు బాలకృష్ణ.

- Advertisement -

ఎన్టీఆర్ – బాలయ్య అభిమానుల మధ్య వార్..

దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.. బాలయ్యకు ఏం తెలుసని అలా కామెంట్ చేశాడని అడుగుతున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ఎంతో కష్టపడితే ఇవాళ కావాలనే పక్కకు పెట్టి ఇప్పుడు మళ్లీ పార్టీ కోసం పనిచేయలేదని కామెంట్లు చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య పై విరుచుకుపడుతుంటే బాలయ్య అభిమానులు కూడా ఎన్టీఆర్ అభిమానులకు గట్టి కౌంటర్ వేస్తున్నారు.. ఇలా ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరితే మాత్రం ఖచ్చితంగా ఆయన నందమూరి ఫ్యామిలీలో ఇక కలవరు అనే వార్తలు స్పష్టం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యేలాగా కనిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు