నందమూరి అభిమానులకు ఈరోజు రెండు అప్డేట్ లు ఇవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఒకటి తన సొంత బ్యానర్ లో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ కాగా ఇంకోటి తన సినిమాకు సంబంధించిన అప్డేట్..! సీనియర్ ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఈ అప్డేట్ లు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు అప్డేట్ ల విషయంలో అభిమానుల ఊహాగానాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
సొంత బ్యానర్లో చేయబోయే సినిమా అప్డేట్ మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ అని, ఇక బాలయ్య సినిమాకి సంబంధించిన అప్డేట్ అప్డేట్ అయితే టైటిల్ అనౌన్స్మెంట్ అని ఎక్స్పెక్ట్ చేశారు.అంతేకాదు ‘జై బాలయ్య’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు కూడా ముచ్చట్లు పెట్టేసుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ రెండు జరగలేదు. సొంత బ్యానర్లో చేయబోయే సినిమా నందమూరి చైతన్య కృష్ణతో చేయబోయే సినిమా కాగా.. బాలయ్య చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ కాస్త ఒక లుక్ కు సంబంధించింది.
పోనీ అదేమైనా కొత్తగా ఉందా అంటే బోయపాటి- బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలకి సంబంధించిన అన్ సీన్ పిక్ లా ఉంది. గోపీచంద్ మలినేని బాలయ్యను ఇంకా కొత్తగా ఏమైనా ప్రెజెంట్ చేస్తాడేమో అని అనుకుంటే పాత బాలయ్యనే మరోసారి చూపించాడు.