Anjali : ఐటెం సాంగ్ ఛాన్స్ అలా !

నితిన్ నుండి రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా మారుతున్నాడు. నితిన్ సొంత బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు కానీ, ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కానీ, ఈ సినిమా పై ఏ మాత్రం బజ్ ఏర్పడలేదు. కానీ, ఇటీవల వచ్చిన ‘రారా రెడ్డి’ ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. ఈ ఒక్క పాటతో ఆడియన్స్ నోట్లో ఈ చిత్రం పేరు తెగ నానుతుంది.

హీరోయిన్ అంజలి ఈ పాటలో ఊర మాస్ స్టెప్పులు వేయడం ఒక హైలెట్ ఉంది. అలాగే, నితిన్ హీరోగా లాంచ్ అయిన ‘జయం’ చిత్రంలోని ‘రాను రానంటూనే చిన్నదో’ అనే సూపర్ హిట్ లిరిక్స్ ను ఇందులో కొంత మిక్స్ చేయడం మరో హైలెట్. అంతేకాదు ఈ పాట చిత్రీకరణ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కథ కూడా నడించిందట. అదేంటి అంటే, నిజానికి ఈ పాటలో ‘జయం’ హీరోయిన్ సదా తో డాన్స్ వేయించాలి అని దర్శకుడు అనుకున్నాడట.

సదా కూడా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే, రీ ఎంట్రీని ఐటెం సాంగ్స్ తో స్టార్ట్ చేయడం ఇష్టం లేదట. అందుకే సదా ఈ ఐటెం సాంగ్ ను రిజక్ట్ చేసిందని టాక్. దీంతో ఈ ఆఫర్ అంజలి వరకు చేరుకుందని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు