యాంకర్ అనసూయ బుల్లితెర పైనే కాదు, వెండితెర పై కూడా సందడి చేస్తుంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ దర్జా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అనసూయతో పాటు సునీల్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. పుష్ప లో వీరిద్దరూ కలిసి భార్యా భర్తలుగా నటించారు. హిట్టు కాంబో కాబట్టి దర్జా పై ప్రేక్షకుల ఫోకస్ పడింది. సినిమాను కొంచెం పుష్ చేస్తే ఇంకా క్రేజ్ ఏర్పడుతుంది. బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.
అయితే, అనసూయ ఈ చిత్రం గురించి అస్సలు పట్టించుకోవడం లేదట. ‘ ప్రమోషన్లకు కూడా హాజరవుతాను ‘ అని చెప్పడం వల్లే, డిమాండ్ చేసిన పారితోషికం ఇచ్చాడట నిర్మాత. కానీ, సినిమా ప్రమోషన్లు ప్రారంభించిన నాటి నుండి, అనసూయను ఎన్ని సార్లు పిలిచినా, రావడం లేదు అని నిర్మాత కొంతమంది సినిమా ప్రముఖుల వద్ద తన బాధను వ్యక్తం చేసినట్టు వినికిడి. దీంతో ఈ యాంకర్ చిన్న సినిమాలను పట్టించుకోదా అని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది.