Allu Arjun: చీరలో అప్పుడు ట్రోల్స్ ఇప్పుడు గూస్బమ్స్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. వారందరూ కూడా సూపర్ హిట్ సినిమాలు చేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ తమకంటూ సొంత బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే వాళ్లకు వాళ్లే బ్యాక్ గ్రౌండ్ క్రియేట్ చేసుకుని వచ్చి మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ అనేది కొంతమేరకు మాత్రమే పనికొస్తుంది అని చెప్పొచ్చు. నిజంగా టాలెంట్ లేకపోతే బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా వాళ్ళు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేరు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తో ఎంతోమంది యంగ్ హీరోస్ తెలుగు సినిమా పరిశ్రమకు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. స్వతహాగా వారికి కూడా టాలెంట్ ఉండటం వలన ఇప్పటికి కొన్ని సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలబడుతున్నారు. అయితే హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ కాన్సెప్ట్ బేసిడ్ సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు. మిగతా హీరోలు సేఫ్ జోన్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్లినా కూడా ఒకటో రెండు సినిమాలు నిరాశపరచడం అనేది కామన్ గా జరుగుతుంది.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని వచ్చిన ఇద్దరు హీరోలు మాత్రం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోలుగా కొనసాగుతున్నారు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకున్నారు. అల్లు రామలింగయ్య వారసుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మెగాస్టార్ సపోర్ట్ తో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ హీరోగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ ను అందుకోలేదు.

- Advertisement -

అల్లు అర్జున్ ఎంత అందంగా ఉంటారు ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గంగోత్రి సినిమాలో మాత్రం అల్లు అర్జున్ అంతగా అందంగా కనిపించడు. చాలామంది ఆ టైంలో అల్లు అర్జున్ ను ట్రోల్స్ కూడా చేశారు. అయితే గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ ఒక సీన్ లో లేడీ గెటప్ లో కనిపిస్తాడు. ఆ సీన్ గంగోత్రి సినిమాలో కొంచెం నవ్వు తెప్పిస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ గెటప్ పిక్ ని పెట్టి చాలామంది సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తూ వచ్చారు.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ లో అల్లు అర్జున్ లేడీ గెటప్ లో కనిపిస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం అల్లు అర్జున్ లేడీ గెటప్ లో కనిపించిన కూడా గూస్బమ్స్ వచ్చేలా పర్ఫార్మ్ చేశాడు. అయితే ఈసారి మాత్రం ట్రోల్ కి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
గంగోత్రి సినిమాలో లేడీ గెటప్ తో ట్రోల్స్ కి గురైన అల్లు అర్జున్ నేడు అదే లేడీ గెటప్ తో అందరికీ సమాధానం చెప్పాడని చెప్పొచ్చు. ఏదైనా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాధించిన ఘనత మాటల్లో చెప్పలేనిది. ఏకంగా నేషనల్ అవార్డును తీసుకురావడమే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది పుష్ప సినిమా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు