Mythri Movie Makers : పట్టిందల్లా బంగారమే

సినీ రంగంలో నిర్మాతలకు ఉండే తలనొప్పులు అన్నీ ఇన్నీ కాదు. కోట్ల రూపాయాలతో సినిమా చేస్తారు. అది హిట్ అవుతుందా, ప్లాప్ అవుతుందా తెలియదు. హిట్ అయినా, పెట్టిన డబ్బులు వస్తాయో, రావో గ్యారంటీ లేదు. ఇలా ఎన్నో భయాలు. ఈ భయాల మధ్యే నిర్మాతలు సినిమాలు చేస్తారు. ఈ క్రమంలోనే కొంతమంది నిర్మాతలు దారుణంగా నష్టపోయి, అప్పులపాలయ్యారు. మరి కొంతమందికి భారీగా కలెక్షన్లు వచ్చి, లాభాలు తెచ్చుకున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్. సూపర్ స్టార్ మహేష్ బాబు “శ్రీమంతుడు” సినిమాతో నిర్మాణ సంస్థగా టాలీవుడ్ కు పరిచయమైన మైత్రి మూవీ మేకర్స్, తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టింది. దీని తర్వాత మైత్రి పట్టిందల్లా బంగారమే అయింది. ఇతర నిర్మాతలు అసూయపడేలా, మైత్రి మూవీ మేకర్స్ రోజు రోజుకు స్టార్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది.

ఇప్పటి వరకు 13 సినిమాలను నిర్మించిన మైత్రి, ఒక రెండు సినిమాలు మినహా అన్నిట్లోనూ మంచి లాభాలనే రాబట్టుకుంది. ప్రస్తుతం మరో ఆరు సినిమాలను లైన్లో పెట్టింది. అందులో బాలయ్య “NBK107”, మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య”, అల్లు అర్జున్ “పుష్ప ది రూల్” లాంటి భారీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు మైత్రి సంస్థకు లాభాలు తెచ్చిపేట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

- Advertisement -

వీటి తర్వాత మైత్రి మూవీ మేకర్స్ మరికొంత మంది స్టార్ హీరోల కమిట్ మెంట్ తీసుకుంది. స్టార్ హీరోలు ఈ నిర్మాతలతో సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి కారణం, హీరోలతో ఈ నిర్మాతలు కొనసాగించే బంధమే అని చెప్పొచ్చు. ఈ సన్నిహిత సంబంధాలతోనే మైత్రి మూవీ మేకర్స్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ప్రస్తుతం మహేష్ బాబు, 28వ సినిమాను త్రివిక్రమ్ తో, 29వ సినిమాను రాజమౌళితో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత మహేష్ మైత్రితో సినిమా చేయనున్నాడట. ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి కొరటాల శివ, సుకుమార్ మధ్య తీవ్ర పోటీ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్టార్ డైరెక్టర్స్ ఇద్దరు కూడా పవర్ ఫుల్ లైన్ తో రెడీగా ఉన్నట్టు సమాచారం. ఒక వేళ కొరటాలను, సుక్కును మహేష్ కాదనుకున్నా, ఇతర డైరెక్టర్ తో తన 30వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే చేయనున్నాడని టాక్.

ఇంత భారీ లైనప్ తో ఉన్న మైత్రి మూవీ మేకర్స్, టాలీవుడ్ లో మరింత సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు