Actress: నటి మాళవికా ఆత్మహత్య… ముంబై అపార్ట్మెంట్ లో డెడ్ బాడీ..!

Actress: ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు, హీరోలు ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఏ కారణం చేత వీరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంది.. అయితే కొంతమంది సూసైడ్ తర్వాత అసలు కారణాలు తెలిస్తే.. మరి కొంత మందిని సంవత్సరాల తరబడినా సూసైడ్ కి గల కారణాలు మిస్టరీగానే మిగిలిపోతాయి.. ఇది ఇలా ఉండగా తాజాగా ఇప్పుడు మరొకటి తన అపార్ట్మెంట్లో డెడ్ బాడీగా కనిపించి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ఆమె ఎవరో కాదు నటి నూర్ మాళవికా దాస్..

దుర్వాసన రావడంతో పొరుగింటి వారు గుర్తింపు..

Actress: Actress Malavika commits suicide... Dead body in Mumbai apartment..!
Actress: Actress Malavika commits suicide… Dead body in Mumbai apartment..!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిరీస్ ది ట్రయల్ నటి నూర్ మాళవికా దాస్ 32 సంవత్సరాల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని ఓషివారా ప్రాంతంలోని అందేరీ లోని ఆమె అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన వస్తుందని పొరుగింటి వారు సమాచారం ఇవ్వడంతో వెంటనే హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. ఇక ఫ్లాట్ తలుపు తెరిచి చూడగానే మాలవికా దాస్ మృతదేహం ఫ్యాన్ కి ఉరి వేసుకుని అక్కడ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. ఇక ఆ తర్వాత పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అస్సాం కి చెందిన నటి మాళవికా దాస్ ఇండస్ట్రీ లోకి రాకముందు ఖతార్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది.

భర్త జైలు పాలు.

ఇకపోతే ప్రముఖ ఓటీటీ వేదిక ఉల్లులో ప్రసారమైన పలు వెబ్ సిరీస్ లలో నటించింది. ఈమె సినిమాల విషయానికి వస్తే.. కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మంచి పేరు దక్కించుకుంది. ఇకపోతే అవినీతి మరియు లైంగిక కుంభకోణంపై తన భర్త జైలు పాలైన తర్వాత తన కుటుంబానికి పూర్తి బాధ్యత వహించాల్సిన గృహిణిగా ఈమె మారిపోయింది.

- Advertisement -

మాళవిక సినిమాలు..

32 ఏళ్ల నటి మాళవిక దాస్ అస్సాం కు చెందినది.. ఇక ఈమె నటించిన హిందీ సినిమాల విషయానికి వస్తే సిస్కియాన్, వాక్ మ్యాన్, తీత్రి చట్నీ, జజ్ఞా ఉపాయ్, చర్మసుఖ్, దేఖీ ఉండేఖీ, బ్యాక్ రోడ్ హల్చల్ మొదలైన అనేక హిందీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా ప్రధాన నటిగా పనిచేసింది.

సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువే..

ఇక నూర్ కి ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 163 K కి పైగా ఫాలోవర్స్ ని కూడా కలిగి ఉంది. ముఖ్యంగా అభిమానుల కోసం నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వీడియోలను కూడా పంచుకుంటూ ఉండేది. ఇక తాజాగా ఐదు రోజుల క్రితం కూడా ఈమె ఒక రీల్ ను పంచుకుంది. ఆ రీల్ తో పాటు ఈమె క్యాప్షన్ లో ఇలా రాసింది.. ఒకే ముఖం మాత్రమే ఉంది.. అది నూర్ మాళవిక ది మాత్రమే.. ఎవరితోనూ సరిపోలదు మరియు నేను అద్దం చూడాల్సిన అవసరం లేదు.. నా అందం మీ ప్రతిబింబం ప్రకారంగా ఉంటుంది అంటూ తెలిపింది..

అలాగే ఇంకొక క్యాప్షన్ లో.. నా అద్దం ప్రపంచం.. కొన్నిసార్లు తీసి.. కొన్నిసార్లు మంచి.. కొన్నిసార్లు వెర్రి.. కొన్నిసార్లు సరదా.. కొన్నిసార్లు కొంటె.. ఇంకొన్నిసార్లు సరదా.. దయగా.. చల్లగా.. కోపంగా.. పిల్లతనంగా.. పరిపక్వత చెందిన దాని లాగా అనిపిస్తుంది అంటూ క్యాప్షన్ జోడించింది .. ఇకపోతే ఈమె మరణానికి అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. ఒక అభిమాని రిప్.. నిజంగా ఈమె చాలా అందంగా ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు