టాలీవుడ్ లో 100 శాతం సక్సస్ రేట్ ఉన్న వారిలో కొరటాల శివ ఒకరు. డైరెక్టర్ గా పరిచయం అయిన సినిమా నుంచి కొరటాలకు ఫెయిల్ అనే మాటే తెలియదు. ప్రతి సినిమా ఒక్కో సంచలనాన్ని సృష్టించింది. అలాగే ఆయన సినిమాల్లో సోషల్ మెసెజ్ కూడా ఉండటం ఆయన ప్రత్యేకత. అందుకే కొరటాల శివతో సినిమా అంటే హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
అయితే కొరటాల శివ ప్రతి సినిమాలో సెకండాఫ్ ప్రేక్షకులకు పిచ్చేక్కేలా ఉంటుంది. ఫస్టాఫ్ లో పాత్రలను పరిచయం చేసి.. సెకండాఫ్ లో విశ్వరూపం చూపిస్తాడు. మిర్చి సినిమాలోని ద్వితియార్థంలో ప్రభాస్.. విలన్స్ మార్చడానికి చేసే ప్రయత్నాల నుంచి చివరి ఫైట్ వరకు ప్రేక్షకులను థియేటర్ కు కట్టిసే విధంగానే ఉంటుంది.
అలాగే శ్రీమంతుడులో కూడా మామిడి తోట ఫైట్ నుంచి జగపతి బాబు ప్లాష్ బ్యాక్, ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. ఇక జనతా గ్యారేజ్ లో అయితే.. సెకండాఫ్ గుస్ భామ్స్ వచ్చేలా కొరటాల డిజైన్ చేశాడు. భరత్ అనే నేను లో కూడా ద్వితియార్థం పిచ్చేక్కిస్తుంది.
దీంతో రేపు రిలీజ్ కాబోయే ఆచార్యలో సెకండాఫ్ ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. సిద్ధ పాత్ర పూర్తిగా సెకండాఫ్ లోనే ఉంటుందని ఇప్పటికే మెగా స్టార్ హింట్ కూడా ఇచ్చేశాడు. ఇక మెగా తండ్రీ కొడుకులు కొరటాల డైరెక్షన్ లో దుమ్ము లేపడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. కొరటాల గత సినిమాల కంటే.. ఆచార్యలో సెకండాఫ్ వేరే లేవెల్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.