Sudheer Babu : ఆ అమ్మాయి గురించి చెప్పడానికి..

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ‘ఏ మాయ చేశావే’ లో సమంతకు అన్నగా నటించి, తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుధీర్ బాబు, ‘ప్రేమకథా చిత్రం’ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హిట్ లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ బాబు చివరగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ తో పేక్షకులను పలకరించాడు.

ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కాగా సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగర్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం గా ఉంది. మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సాలిడ్ ప్లాన్ చేశారు. ఈ ట్రైలర్ ను ఈ సెప్టెంబర్ 5న సాయంత్రం 5:04 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా రిలీజ్ చేయనున్నారు. దీన్ని ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమో తో కన్ఫర్మ్ చేశారు. మరి ఈ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు