Power Star : డబుల్ ట్రీట్

ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ సినిమాలు అన్నా, అందులోని డైలాగ్స్ అన్నా.. యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. పవన్ నటించిన సినిమాలు ప్లాప్ అయినా కలెక్షన్లు ఎక్కువే వస్తాయి. నిర్మాతలు నష్టాలు రావు. అందుకే పవర్ స్టార్ తో సినిమాలు చేయాలని చాలా మంది నిర్మాతలు అనుకుంటారు. అయితే ప్రతి ఏటా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు.

అలాంటి రోజు రానే వచ్చింది. మరో ఐదు రోజుల్లో సెప్టెంబర్ 2 వస్తుంది. సెప్టెంబర్ 2 అంటే మెగా అభిమానులకు ఒక రకమైన పండగే. అయితే పవన్ పుట్టిన రోజు సందర్బంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. జల్సా సినిమాను 4K ప్రింట్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ సినిమాను మళ్లీ చూడాలని, రీ రిలీజ్ చరిత్రలో ఒక రికార్డు నమోదు చేయాలని చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, పవన్ ఫ్యాన్స్ కు మరో ట్రీట్ వచ్చింది. జల్సా తో పాటు పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తమ్ముడు ను కూడా రీ రిలీజ్ చేయాలని ఆ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా అధికారిక ప్రకటన కూడా చేశారు. తమ్ముడు సినిమాను ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో థియేటర్ లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ అభిమానులకు పుట్టిన రోజు సందర్భంగా డబుల్ ట్రీట్ దక్కింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు