#13YearsForKhaleja: ఓల్డ్ వైన్

ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి విజయం సాధిస్తుందో ఎవరు డిసైడ్ చేయలేరు. ఒకవేళ అదే డిసైడ్ చెయ్యగలిగితే ఇండస్ట్రీలో రిలీజ్ అయినా సినిమాలన్నీ మోస్ట్లీ బ్లాక్ బస్టర్లు అవుతాయి. కొన్ని సినిమాలు చూడగానే అర్ధం కావు. చూడగా చూడగా అర్ధం అవుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో సరిగ్గా 13 ఏళ్ల క్రితం అలాంటి సినిమానే పడింది. అదే మహేష్ ఖలేజా. ఈ సినిమా ఒక ఓల్డ్ వైన్ లాంటిది. రోజులు పెరిగే కొద్ది టేస్ట్ పెరుగుతుంది. మహేష్ లోని ఒక పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసిన సినిమా ఇది.

రాజు క్యారెక్టర్ ను త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్. మహేష్ కామిక్ టైమింగ్, వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ తో ఆడియన్స్ కు ఊహించని సప్రైజ్ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా మాత్రం ఊహించని విజయాన్ని ఇవ్వలేదు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని రాసాడు త్రివిక్రమ్ ఈ సినిమాలో.. ఖలేజా సినిమా నిజంగా ఒక అద్భుతం మనం అప్పుడు గుర్తించలేదు. కానీ ఇప్పుడు మనం గుర్తించాల్సిన అవసరం లేదు.

బేసిక్ గా ప్రతి ఫిలిం మేకర్ ఒక సినిమాను మొదలుపెట్టేముందు తన మెదడులో చాలా ఆలోచనలు రేకెత్తుతాయి. ఈ సినిమా మనం ఎందుకు తీస్తున్నాం.? ఈ సినిమాతో మనం ఏమి చెప్పాలి అనుకుంటున్నాం.? ఈ సినిమా మనకు నచ్చినట్లు తీస్తున్నామా.? ఆడియన్స్ కు నచ్చినట్లు తీస్తున్నామా.? మనకు నచ్చినట్లు తీస్తూ ఆడియన్స్ నచ్చేలా చేస్తున్నామా.? అనే ఒక కనుఫ్యూజన్ మొదలవుతుంది. ఆ కన్ఫ్యూజన్ లో ఒక్కోసారి చెప్పాల్సిన విషయాన్ని కొన్ని సార్లు మనం చెప్పలేము. సరిగ్గా ఖలేజా సినిమాలో అదే జరిగింది. “దైవం మనుష్య రూపేణా” అనే సంస్కృతం లోని ఒక లైన్ తీసుకుని కథను అల్లిన త్రివిక్రమ్ ఇంటెన్సెన్ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. సీతారామ రాజు అనే టాక్సీ డ్రైవర్ ను దేవుడు అంటే ప్రేక్షకులు తీసుకోలేకపోయారు.

- Advertisement -

కృష్ణుడు అనేవాడు మహా భారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు పాటు రాజ్యం పరిపాలించాడు. ఆయన ఒక మాములు మనిషిగా చనిపోయాడు. ఆయన చనిపోయిన తరువాత ఆయన రాజ్యాన్ని దొంగలు దోచుకెళ్లిపోయారు. ఆయన కొడుకులను చంపేశారు. ఆయన భార్యలను దోచుకెళ్లిపోయారు. సత్యభామ విధవ రాలిగా తపోభూమికి వెళ్ళిపోయింది. రుక్మిణి సతీసహగమనం చేసుకుంది. ఈ విషయాలు ఏవి మనకు తెలియవు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఒక నార్మల్ యాదవ కింగ్. మనకు భగవత్గీత చెప్పిన కృష్ణుడు మాత్రమే మనకు కావాలి. ఎందుకంటే ఆయన అప్పుడు మాత్రమే మనకు దేవుడు. అని చెప్తూ త్రివిక్రమ్ ఖలేజా సినిమా గురించి ఇచ్చిన ఎక్సప్లనేషన్ వింటే ఇంత గొప్ప సినిమాను హిట్ చేయకుండా వదిలేశామా అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఈ సినిమాకి మణిశర్మ అందించిన మ్యూజిక్ ఎప్పటికి మరచిపోలేము. ఇప్పటికి సదా శివ సన్యాసి పాటను విన్న ప్రతిసారి మనలో ఒక రకమైన భక్తిరసాభావం మొదలవుతుంది. అప్పటివరకు చాలా సెటిల్ పెర్ఫార్మన్స్ చేసిన మహేష్,ఖలేజా సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయాడు.మహేష్ లో ఇంత ఎనర్జీ ఉందా అనిపించాడు ఆడియన్స్ తో,దేవుడు ఎక్కడో ఉండడు నీలోను, నాలోనే ఉంటాడు అని ఒక టైం లో మహేష్ రియలైజ్ అయినా సన్నివేశం సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు.ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఒక టాక్సీ డ్రైవర్ దేవుడు ఏంటి అని ఆడియన్స్ లో ఒక రకమైన ఆలోచన మొదలైన టైం లో ఆ ఒక్క సీన్ తో చెక్ పెట్టాడు త్రివిక్రమ్.

ఒక కమర్షియల్ సినిమాను మీనింగ్ ఫుల్ చెప్పొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా ఖలేజా. అప్పుడు ఈ సినిమా ఖలేజా మనకు తెలియకపోయిన ఇప్పటికి టీవిలో టెలికాస్ట్ అవుతున్న ప్రతిసారి త్రివిక్రమ్, మహేష్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తూనే ఉంటుంది.

#13Years_for_Khaleja

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు