Personality Development : ఇలాంటి కామెంట్స్ చేశారంటే ఆడదానికి ఆడదే శత్రువు అవుతుంది… జాగ్రత్త

రెండు కొప్పులు ఒకే దగ్గర ఇమడలేవు, ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెతలు తరచుగా వింటూనే ఉంటాము. ఒకప్పుడు అత్తా కోడళ్ళు, ఆడపడుచు, తోడి కోడళ్ళ పోరు గురించి చెప్పడానికి ఈ సామెతలను వాడేవారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఆడవాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. బాగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటూ తమ కాళ్లపై తాము ఎదుగుతున్నారు. అయితే ఎంత ఎదిగినా కొన్ని తప్పులను మాత్రం తరచుగా చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇతర అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు. తెలియకుండానే హర్ట్ చేస్తూ ఉంటారు. హార్ట్ అయ్యేటంత తప్పుగా ఏం మాట్లాడాను అని మీకు అనిపించినా, అవతల వ్యక్తికి మాత్రం ఆ మాట గట్టిగానే తగులుతుంది. ముఖ్యంగా ఆఫీసులలో, బంధువుల్లో, స్నేహితులతో ఇలాంటివి కామన్. అమ్మాయిలు తమకు తెలియకుండా ఇతరుల ఆడవాళ్ళను బాధించేలా చేసే కామెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. మీరు ఇది వేసుకుంటే ఇంకా బాగుంటారు
    మీరు ఇలాంటి సలహాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో తను బాగాలేదని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అవుతుంది.
  2. మీరు అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు
    సాధారణంగా మేకప్ వేసుకోనప్పుడు ఎవరినైనా ఇలా అన్నారంటే హర్ట్ చేస్తుంది. అపార్ధానికి దారి తీస్తుంది. సాధారణంగా ఒక అమ్మాయి రెండు సందర్భాలలో మాత్రమే అలసిపోయింది అని చెప్పగలం. 1. ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు 2. ఆమెకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఉన్నప్పుడు. మిగతా సందర్భాల్లో ఇలాంటి కామెంట్ చేస్తే అది మొరటుగా ఉంటుంది.
  3. మీరు రెస్ట్ తీసుకోవాలి
    సాధారణంగా ఎక్కువగా పనిచేసే వాళ్ళతో ఇలాంటి మాటలు చెబుతూ ఉంటాం. అయితే ఇది కొన్ని సందర్భాల్లో కొంతమందికి వినడానికి కూడా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అంటే వాళ్లు ఆ పనిని చేయలేరు అని ఇండైరెక్టుగా చెప్పినట్టు అవుతుంది.
  4. మీకు పిల్లలు పుడితే / తల్లి అయితే అర్థమవుతుంది
    అబార్షన్ అయిన వాళ్ళు లేదా తల్లి కాలేని వాళ్ల దగ్గర పొరపాటున కూడా ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. ఇది వాళ్లను చులకన చేసినట్టుగా అవుతుంది. అంతేకాకుండా మీ అహంకారాన్ని బయట పెట్టినట్టు అన్పిస్తోంది.
  5. పెళ్లి ఎప్పుడు?
    ప్రస్తుతం అమ్మాయిలు ఇంతకు ముందులాగా పెళ్లి గురించి తొందరపడట్లేదు. తమకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు లేదా ఇష్టం వచ్చినప్పుడే పెళ్లికి రెడీ అవుతున్నారు. ఒకవేళ ఇతర అమ్మాయిలను మరో అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? అని అడిగితే అమ్మాయి కాబట్టి కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని ఈ ప్రశ్న ద్వారా మీరు వాళ్ల పర్సనల్ విషయంలో అనవసరంగా కలగజేసుకుంటున్నారనే ఫీలింగ్ కలగొచ్చు. వీటితోపాటు మీరు అలా చేయలేరు, మీకు ఇదే కరెక్ట్, నువ్వు ఆడవాళ్ళలోనే బెస్ట్ వంటి కామెంట్స్ సదుద్దేశంతో చేసినా చాలా సందర్భాల్లో నెగెటివ్ గా అనిపిస్తాయి. ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువులు అనే మాటను నిజం చేస్తాయి. కాబట్టి ఈ కామెంట్స్ చేసేముందు ఒక్కసారి ఆలోచించండి.
  6. Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు