Relationship Tips : ప్రతీ అమ్మాయికి బాయ్ బెస్టీ ఉండాల్సిందే… ఎందుకంటే?

ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఒత్తిడి, విచారణ తగ్గించడానికి కచ్చితంగా స్నేహితులు ఉండాల్సిందే. అలాగే మంచి, చెడుల్లో తోడు ఉండడానికి, సీక్రెట్స్ ను పంచుకోవడానికి బెస్ట్ ఫ్రెండ్స్ కావాల్సిందే. చాలా మంది స్నేహితులను కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ ఉంటారు. అయితే సాధారణంగా అమ్మాయిలకు అమ్మాయిలు, అబ్బాయిలకు అబ్బాయిలు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి అనే కట్టుబాట్లు నేటికీ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ ఈ పద్ధతి కంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే స్నేహమే బెస్ట్ అవుతుంది. ఎందుకంటే అబ్బాయితో స్నేహం అనేది అమ్మాయిలకు చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రతి అమ్మాయి జీవితంలో ఒక బాయ్ బెస్టీ ఉండాల్సిందే. బాయ్ బెస్టీనే ఎందుకు అంటే…

అసూయ ఉండదు


సాధారణంగా అబ్బాయిలకు ఫ్రెండ్స్ పై పగ పెంచుకోవడం అనేది ఇష్టం ఉండదు. కాబట్టి బాయ్ బెస్టీ ఎన్నిసార్లు గొడవపడినా ఇద్దరి మధ్య మాటలు ఆగవు. కేవలం నిమిషాల్లోనే మళ్లీ కలిసిపోతారు. అలాగే అసూయ పడరు. ఒకవేళ వాళ్లే తప్పు చేసి ఉంటే మిమ్మల్ని నవ్వించడానికి ఏదైనా చేస్తారు.

- Advertisement -

సీక్రెట్స్ సీక్రెట్స్ గానే ఉంటాయి


అమ్మాయిలకు ఏదైనా సీక్రెట్ చెబితే నిమిషాల్లోనే వైరల్ అయిపోతుంది. కానీ అబ్బాయిలు అలా కాదు. చాలామంది అబ్బాయిలు ఏదైనా చెబితే దాన్ని అక్కడితో మర్చిపోతారు. కాబట్టి అమ్మాయిలు హ్యాపీగా తమ సీక్రెట్స్ ను బాయ్ బెస్టీతో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరి మధ్య గొడవ జరిగినా, నెలల తరబడి మాట్లాడకుండా ఉన్నా మీ సీక్రెట్స్ మాత్రం సీక్రెట్ గానే ఉంటాయి. మీ ప్రవర్తనతో సంబంధం లేకుండా మీ బెస్ట్ ఫ్రెండ్ వాటిని సీక్రెట్ గానే ఉంచుతాడు.

నిజాయితీ


అమ్మాయిల విషయంలో బాయ్ బెస్టీ ఎప్పుడూ నిజాయితీగానే ఉంటారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తోడుగా ఉండడమే కాకుండా, ఒకవేళ చెడుగా మాట్లాడినా కూడా పట్టించుకోడు. మీకు సంబంధించిన ప్రతీ విషయంలో నిజాయితీగానే ఉంటారు. ఇక తనతో ఎక్కడికి వెళ్లినా కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే మీరు ఇబ్బందుల్లో ఉన్నా, లేదంటే ఎప్పుడైనా, ఏ అవసరం ఉన్నా ముందుగా మీ దగ్గరకు వచ్చే వ్యక్తి బాయ్ బెస్టీనే. మీకోసం పోరాడతాడు, నిలబడతాడు, మిమ్మల్ని ఎవ్వరూ బాధ పెట్టకుండా చూసుకుంటాడు.

జడ్జ్ చేయరు


మామూలుగా అమ్మాయి అమ్మాయి గొడవ పడితే వెంటనే జడ్జ్ చేస్తారు. గతంలో జరిగిపోయినవన్ని గుర్తు చేసుకుని మరీ తిట్టుకుంటారు. కానీ అదే బాయ్ బెస్టీతో గొడవ పడితే అమ్మాయి ఎంత అసహ్యంగా ప్రవర్తించినా పట్టించుకోరు. ఎప్పుడూ తోడుగా ఉంటూ, ఏం చేసినా సపోర్ట్ గా, సాయంగా ఉంటారు. కాబట్టి ప్రతీ అమ్మాయికి ఓ బాయ్ బెస్టీ ఉండాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు