Anant -Radhika re-wedding celebration : మళ్లీ అంబానీ వద్దకు క్యూ కట్టబోతున్న బాలీవుడ్ స్టార్స్… క్రూయిజ్ షిప్‌లో భారీ పార్టీ..!

అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ల వివాహం ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది అనడంలో సందేహం లేదు.. ప్రపంచంలో ఉన్న పెద్దపెద్ద సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరవుతున్నారు.. ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ జరగగా.. చాలామంది సెలబ్రిటీలు సందడి చేశారు.. ఇక మే 28, 29 , 30 తారీకులలో వీరి రెండవ ప్రీ వెడ్డింగ్ కూడా చాలా ఘనంగా జరగబోతోంది.. ముఖ్యంగా మూడు రోజుల పాటు ఈ రెండవ ముందస్తు వివాహాన్ని ఘనంగా జరపనున్నారు ముఖేష్ అంబానీ..

క్రూయిజ్ షిప్ లో ప్రీ వెడ్డింగ్.

Anant-Radhika re-wedding celebration: Bollywood stars who are going to queue up for Ambani again... A huge party in a cruise ship..!
Anant-Radhika re-wedding celebration: Bollywood stars who are going to queue up for Ambani again… A huge party in a cruise ship..!

ప్రత్యేకించి క్రూయిజ్ షిప్ లో వీరి రెండవ ప్రీ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం.. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ కి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ మరియు అలియా భట్ వంటి బాలీవుడ్ ప్రముఖులతో సహా దాదాపు 800 మంది అతిథులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదనంగా అతిధుల సౌకర్యం కోసం.. వారికి కావలసిన సపర్యలు చేయడానికి 600 మంది సిబ్బందిని కూడా ఆన్ బోర్డులో నియమించినట్లు తెలుస్తోంది.

మరోవైపు అందంగా ముస్తాబైన కల్యాణ వేదిక..

ముందస్తు వివాహమే ఇలా జరిగితే.. ఇక పెళ్లి ఎలా జరుగుతుందో ఊహకి కూడా అందదు.. అనుకున్నట్టుగానే అంతకుమించి అనే లాగా వివాహాన్ని నిర్వహించబోతున్నారు ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో త్వరలో వీరి వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరొకవైపు రాధిక కుటుంబం కూడా హెల్త్ కేర్ వ్యాపారంలో ముందంజలో ఉంది.. తన తండ్రికి సంబంధించిన సంస్థలలో రాధిక కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది.. ఈ క్రమంలోనే అనంత్, రాధిక పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కళ్యాణ మండపానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

- Advertisement -

కళ్యాణ వేదిక కోసం రూ.1100 కోట్లు ఖర్చు..

ఈ వీడియోలో కళ్యాణ మండపం అంగరంగ వైభవంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో అంబానీ యొక్క రిచ్ నెస్ కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. వేలాదిమంది కార్మికులు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసి.. ఆ పెళ్లి వేదికను నిర్మించినట్లు సమాచారం.. ముఖ్యంగా ఈ పెళ్లి వేడుక జరిగే వేదిక నిర్మాణం కోసం ముఖేష్ అంబానీ అక్షరాల రూ.1100 కోట్లు ఖర్చు చేశారట. ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఈ పెళ్లి వేదిక కళ్ళు చెదిరేలా కనిపిస్తోంది. అద్భుతమైన దీప కాంతులతో మిరమెట్లు గొలుపుతోంది. వేలాది మంది కార్మికులు కళ్యాణ వేదిక నిర్మాణంలో పాలుపంచుకున్నారు.. రిలయన్స్ కంపెనీలో పనిచేసే కీలక ఉద్యోగులు ఆ కళ్యాణ వేదిక నిర్మాణాన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షించారు.. చివరికి పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అనంత్ వివాహానికి వచ్చే అతిధుల కోసం కరీంనగర్ నుంచి ప్రత్యేకమైన వెండి పాత్రలను కూడా ఆర్డర్ చేశారట.. కల్యాణ వేదిక మాత్రమే కాకుండా విందు విషయంలో కూడా అంబానీ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.. ఏది ఏమైనా అనంత అంబానీ రాధిక మర్జంటల వివాహం శాశ్వతంగా చరిత్రపుటల్లో లిఖించబడుతుందని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు