Anudeep Kv: అనుదీప్ సీరియస్ ఇంటర్వ్యూ

పిట్టగోడ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్ కే.వి.
“జాతి రత్నాలు” సినిమాతో మంచి పాపులర్ అయ్యాడు.
“జాతిరత్నాలు” సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న అనుదీప్ ఇన్నోసెన్స్ , తాను కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇచ్చే ఆన్సర్స్ , కొన్ని రియాలిటీ షోస్ లో ప్రవర్తించే తీరు ఇవన్నీ అనుదీప్ ను ఒక సెలబ్రిటీను చేసాయి.

ఎట్టకేలకు “జాతి రత్నాలు” సినిమా రిలీజై పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం అనుదీప్ శివ కార్తికేయన్ తో కూడా తన సినిమాను పూర్తి చేసాడు. అంతేకాకుండా అనుదీప్ “ఫస్ట్ డే ఫస్ట్ షో” అనే ఒక సినిమాకి కథను కూడా అందించాడు. ఈ సినిమాకి అనుదీప్ అసిస్టెంట్ డైరెక్టరైన వంశీ దర్శకత్వం వహించాడు. “ఫస్ట్ డే ఫస్ట్ షో” సినిమాను జులై 2వ వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ టీం అనుదీప్ కేవీ తో ఒక సీరియస్ ఇంటర్వ్యూ ను ప్లాన్ చేసారు.
ఆ ఇంటర్వ్యూ లో కొన్ని ప్రశ్నలకు ఇలా సమాధానమిచ్చాడు.

అనుదీప్ ఏమి చదువుకున్నారు.?

- Advertisement -

ఒకటే డిగ్రీ చదువుకోవాలని రూల్ ఏమైనా ఉందా.?
ఆరిస్టాటిల్ ఉన్నప్పుడు అన్ని సబ్జక్ట్స్ కలిసే ఉంటుండే
తరువాత మార్చారు. సోషల్ అని , సైన్స్ అని , మాథ్స్ అని, అలా.

జయమ్మ పంచాయితీ సినిమా చూసారా.?

ఆ చూసా

ఏ సీన్ మీకు బాగా ఇష్టం ?

జయమ్మతో ఒక పంచాయితీ సీన్ ఉంటుంది కదా ఆ సీన్ బాగుంటుంది.

ఎంత నవ్వించినా ఎక్సప్రెషన్ లేకుండా ఎలా ఉంటారు.?

అవునా… దీనికి కూడా ఎక్సప్రెషన్ లేదు, నెక్స్ట్

అనుదీప్ ఎప్పుడైనా ఆర్జీవీ ను కలిసారా.?

కలిసాను, తనకు రైటర్ రిక్వెర్మెంట్ ఉంది అని తెలిసి వేరే ఫ్రెండ్ తో కలిస్తే, మీ ఫేస్ విషాదకరంగా ఉంది మీరు కామెడీ రాస్తారా అని అన్నారు.

మీకు ఇష్టమైన ఐదుగురు డైరెక్టర్స్.?

చార్లీ చాప్లిన్, రాజ్ కుమార్ సంతోషి, స్టీపెన్ చౌ, వెంకట్ ప్రభు , షోయబ్ మన్సూర్ అని ఒక పాకిస్థాన్ డైరెక్టర్.

సీరియస్ ఇంటర్వూ అని చెప్పిన ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం ఫన్ తోనే సాగింది. సాగర సంగమం, స్వాతి ముత్యం లాంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన పూర్ణోదయా పిక్చర్స్ కి అనుబంధ సంస్థలు అయిన శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ , మిత్రవింద మూవీస్ లో ఏడిద శ్రీజ, ఏడిద శ్రీరామ్ ఈ సినిమాను నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు