Guntur Kaaram Update: థమన్‌తో త్రివిక్రమ్‌కి ఒకే , కానీ మహేష్‌తో ఏమైంది.?

ఇటీవల స్కంద అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. బోయపాటి సినిమాలు అంటే ఎలా ఉంటుందో… ఒకటి అంటే ఒక్క ఎలిమెంట్ తగ్గకుండా అచ్చం బోయపాటి సినిమాల్లానే ఉంది. సినిమా మొత్తం చూస్తే గతంలో వచ్చిన ఆయన సినిమాలతో పోలిస్తే ఒకటే తక్కవ అనిపిస్తుంది. అదే హీరోగా బాలయ్య లేకపోవడం. ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చింది. ఇది మూవీ యూనిట్ కి కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే, స్కంద ఓ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని,నిర్మాత, డైరెక్టర్ హీరో ఇలా అందరూ అనుకున్నారు. కానీ, ప్రేక్షకులు దీన్ని ట్రోలింగ్ కోసం వాడుకుంటున్నారు.

ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా గట్టేక్కించలేకపోయింది. దీంతో థమన్ పై కాస్త గట్టిగానే నెగివిటి వచ్చింది. థమన్ పని అయిపోయిందని, కొత్త ట్యూన్స్ లేవని, పాతవి కాపీ కొడితే దొరికిపోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఎంతలా అంటే… తన తర్వాత సినిమా గుంటూరు కారంపై ప్రభావం పడేలా ట్రోల్స్ వచ్చాయి.

స్కంద ఎఫెక్టో… లేదా నిజంగానే థమన్ ఇచ్చిన ట్యూన్స్ బాలేదో.. తెలిదు కానీ, గుంటూరు కారం సినిమాకు థమన్ ఇచ్చిన ట్యూన్స్ అన్నింటినీ మహేష్ బాబు రిజెక్ట్ చేశారట.”సర్కారు వారి పాట” కు సరైన బాక్గ్రౌండ్ స్కోర్ అందించలేదని మహేష్ ఫ్యాన్స్ ఇదివరకే ట్విట్టర్ వేదికగా థమన్ ను ట్రోల్ చేసారు. ఇప్పుడు గుంటూరు కారం విషయంలో అదే జరిగితే అసలు తీసుకోలేరు.

- Advertisement -

అంతే కాదు, థమన్ ను పక్కన పెట్టి, జీవీ ప్రకాశ్ తో చేసుకుందాం అని కూడా త్రివిక్రమ్ కు మహేష్ చెప్పారట. కానీ, థమన్‌తో తాను మంచి అవుట్ పుట్ ఇప్పిస్తానని మహేష్ కు త్రివిక్రమ్ చెప్పి… మ్యూజిక్ బాధ్యతలను తీసుకున్నాడట.

దీంతో ప్రతి రోజు థమన్‌తో త్రివిక్రమ్ స్వయంగా కూర్చుని ట్యూన్స్ కట్టిస్తున్నాడట. ఒక్క ట్యూన్ నచ్చకపోయినా, వెంటనే రిజెక్ట్ చేసి, కొత్త ట్యూన్స్ చేయిస్తున్నాడట. అంటే… కింగ్ సినిమాలో జయసూర్య పాత్రతో (బ్రహ్మనందం) నాగార్జున కొత్తదనం కోరుకున్నట్టు… గుంటూరు కారం కోసం థమన్ నుంచి కొత్తదనాన్ని త్రివిక్రమ్ తీసుకున్నాడట.

దీని ఫలితంగా ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమాలో 3 పాటలను పూర్తి చేశారట. మరో రెండు సాంగ్స్‌తో పాటు ఒక బిట్ సాంగ్ ఉందని తెలుస్తుంది. వీటకి మరో 10 రోజులైన పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఈ మూడు సాంగ్స్ ను త్రివిక్రమ్ మాత్రమే ఫైనల్ చేశారు. అవి ఇంకా మహేష్ దగ్గరకి వెళ్లలేదు. మహేష్ ఫైనల్ చేస్తేనే సినిమాలోకి వస్తాయి. లేకోపోతే.. ఎప్పటి లాగే… మ్యూజిక్ పని కాలేదనే పేరుతో సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు