sreemukhi: ఆ దర్శకుడు శ్రీముఖిని న్యూడ్ వీడియో పంపించమన్నాడా..?

క్యాస్టింగ్ కౌచ్.. ఈ పేరు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్ కి బలైన అమ్మాయిలు బయటపెట్టారు. ఎంతమంది బయటపెడుతున్నా సరే ఈ విషయంపై సినీ పెద్దలు ఎవరు పెద్దగా రెస్పాండ్ కాకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న శ్రీముఖిని సైతం ఓ డైరెక్టర్ బలవంతం చేశాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షోల దగ్గర నుంచి ఈవెంట్స్ వరకు తనదైన ఎంటర్టైన్మెంట్ ఇస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. 30 ఏళ్ల మార్క్ కూడా దాటేసింది. తన చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగు వారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు శ్రీముఖి పెద్దగా సినిమాలలో నటించడం లేదు కానీ ఒకప్పుడు కొన్ని సినిమాలలో ఆడపాదడపా రోల్స్ లో కనిపించేది. ముఖ్యంగా హీరోస్ కి సిస్టర్ రోల్స్ లో బాగా కనిపించి మెప్పించింది.

కానీ సడన్ గా వెండితెరకు దూరమైపోయింది. దీనికి కారణం.. ఆమెను ఓ దర్శకుడు పెద్ద హీరో సినిమాలో సిస్టర్ పాత్ర కోసం ఎంచుకున్నాడట. అప్పటికే బడా యాంకర్ కావడంతో క్రేజ్ తో పాటు మరింత ఫేమస్ కావచ్చని శ్రీముఖి ఆశపడ్డారట. అయితే ఆఫ్ట్రాల్ యాంకర్ ఏ కదా.. చెప్పినట్టు చేస్తుందని ఆ డైరెక్టర్ హద్దులు మీరిపోయి ఆమె న్యూడ్ వీడియో పంపించమంటూ ఆయన అసిస్టెంట్ దగ్గర చెప్పించారట. దీంతో షాక్ అయిన శ్రీముఖి అతని నెంబర్ ని బ్లాక్ చేయడమే కాకుండా.. ఆ డైరెక్టర్ ఇంత వెధవ..? అని ఆ సినిమా ఛాన్స్ ని వదిలేసుకుందట. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు