Skanda: కన్ఫ్యూజన్లో ఉన్నానంటున్న శ్రీలీల – బ్రేక్ అవసరమేమో..!

Skanda

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది శ్రీలీల. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేకుండా అందరితో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం సుమారు డజను పైగా  సినిమాలను లైన్లో పెట్టి ప్రతి శుక్రవారం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.

బోయపాటి డైరెక్షన్లో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించిన స్కంద సినిమా ఇటీవల రిలీజయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన కెరీర్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన శ్రీలీల ఎలా స్పందించాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నానని బదులిచ్చింది.

కెరీర్లో ప్రస్తుతం నా గురించి చెప్పాలంటే ‘ మాట రాని మౌనం’ అని చెప్పచ్చని సమాధానం ఇచ్చింది శ్రీలీల. ఏం చేయాలో తెలియని స్థితిలో  ఒక రకమైన గందరగోళంలో ఉన్నానని చెప్పింది. దీన్ని బట్టి చుస్తే, వరుస ఆఫర్లతో తీరిక లేకుండా గడుపుతున్న శ్రీలీలకి ప్రస్తుతం బ్రేక్ అవసరమేమో అని అనిపిస్తోంది. పైగా స్కంద సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ కేవలం సాంగ్స్ కి మాత్రమే పరిమితం అన్నట్లు ఉంది.

- Advertisement -

టాలీవుడ్లో ఆల్మోస్ట్ టాప్ హీరోయిన్ ప్లేస్ కి చేరువలో ఉన్న క్రమంలో స్కంద సినిమాలో లాంటి ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని శ్రీలీల గ్రహించాలి. బాలకృష్ణ, మహేష్ బాబు దగ్గర్నుండి నితిన్, వైష్ణవ తేజ్ వరకు అందరు హీరోలను కవర్ చేసిన ఈ అమ్మడు ఇకనైనా కాస్త స్పీడ్ తగ్గించి ఆచి తూచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ తో మెప్పిస్తుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు