Hanuman: స్టార్ కిడ్స్ ని ఇలా అడిగే ధైర్యం ఉందా? జర్నలిస్ట్ కు తేజ స్ట్రాంగ్ కౌంటర్

యంగ్ హీరో తేజ సజ్జ తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఓ సీనియర్ జర్నలిస్టుపై మండిపడ్డాడు. ఇదే ప్రశ్నను స్టార్ కిడ్స్ ని అడగరు అంటూ ఫైర్ అయ్యాడు. ఇంతకీ తేజ కు కోపం తెప్పించిన ఆ ప్రశ్న ఏంటి? మధ్యలో స్టార్ కిడ్స్ ని ఎందుకు లాగుతున్నారు? అనే వివరాల్లోకి వెళితే…

తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సూపర్ హీరో మూవీ “హనుమాన్”. ఈ మూవీలో తేజ సజ్జకు జోడిగా అమృత అయ్యర్ నటిస్తోంది. “జాంబి రెడ్డి” ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తేజ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక సూపర్ హీరో కథాంశానికి భక్తిని మిక్స్ చేసి “హనుమాన్”గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ట్రైలర్ లాంచ్ సందర్భంగా “హనుమాన్” చిత్ర బృందం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ సందర్భంగా ఓ సీనియర్ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు హీరో తేజ. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి అంటే?

ఈ ప్రశ్నోత్తరాల సెషన్లో “తేజ మిమ్మల్ని టాలీవుడ్ ఆడియన్స్ ఇంకా బాల నటుడుగానే చూస్తున్నారు. ఈ సినిమా కాన్వాస్ చూసుకుంటే చాలా పెద్దది. ఆ కాన్వాస్ లో మిమ్మల్ని చూస్తే ఇది మీరు లెవెల్ దాటిపోయిన సినిమా అనిపిస్తుంది. మీరేం అనుకుంటున్నారు?” అనే ప్రశ్న తేజకు ఎదురయింది. ఆ ప్రశ్నకు సమాధానంగా తేజ స్పందిస్తూ “చెప్తాను మరి మీరేం అనుకోకూడదు” అంటూ స్టార్ట్ చేశాడు. “ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ గానీ ఇలా వచ్చారు అనుకోండి. వాళ్లు ఫస్ట్ మూవీనే ఇంతకంటే పెద్ద సినిమా చేశారు అనుకోండి. మీరెవరు ఈ ప్రశ్న అడగట్లేదు. నాలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి, ఇన్ని సినిమాలు చేసి, పెద్దయ్యాక కూడా క్యారెక్టర్లు చేసి, ప్రశాంత్ తో సినిమా చేసి, మళ్లీ బయట డైరెక్టర్స్ తో సినిమాలు చేసి, కింద మీద పడి, కష్టపడి ఇక్కడ బతకాలి అని సినిమాలు చేస్తే మీరు మాత్రం చిన్నచూపు చూసినట్టుగా అనిపిస్తుంది. మీరు వేసిన ప్రశ్న చూస్తుంటే ఆ ఫీలింగ్ వస్తుంది. నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు. వాళ్లు నేను ఒకటి అని కూడా చెప్పట్లేదు. వాళ్లందరికీ ఆ అవకాశం వచ్చింది. అలాగే నాకు కూడా హనుమాన్ అనే అవకాశం వచ్చింది. సినిమా నాకేం ఇచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది. కానీ సినిమాకు నేనేం ఇచ్చాను అనేది మాత్రం డైరెక్టర్ కు, నాకు మాత్రమే తెలుస్తుంది. నేను సినిమా కోసం 100% ఎఫర్ట్ పెట్టా. అందుకోసమే నాకు ఈ అవకాశం వచ్చిందేమో. నేను ఈ సినిమాలో ఉండడం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో. దీన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. సినిమా అయిపోయింది. ఇక నా నుంచి ఎవరో దీన్ని లాక్కోలేరు” అంటూ అప్పటిదాకా సీరియస్ గా చెప్పుకొచ్చిన తేజ చివరి డైలాగ్ మాత్రం నవ్వుతూ అక్కడ పరిస్థితిని కూల్ చేసేసాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా, నెటిజెన్లు కూడా తేజ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.

- Advertisement -

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు