Nora Fatehi : అప్పుడు బార్లో 5 వేలకే పని చేసిన హీరోయిన్… ఇప్పుడు కోట్లలో సంపాదన

Nora Fatehi

సిల్వర్ స్క్రీన్ పై మెరిసే స్టార్స్ అంతా గతంలో ఎన్నో కష్టాలు పడ్డవాళ్లే. ఇప్పుడు తారలుగా జేజేలు అందుకుంటున్న కొంతమంది అయితే తినడానికి తిండి కూడా లేకుండా పూట గడవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కడుపు కాల్చుకుని రెక్కలు ముక్కలు చేసుకుంటేనే గాని చాలా మందికి సెలబ్రిటీ స్టేటస్ రాదు. కానీ కొంతమందికి మాత్రం టైం కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతారు. ఇక ఒకప్పుడు బార్లో 5000లకే పని చేసిన హీరోయిన్ నోరా ఫతేహి ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ కోట్లలో సంపాదిస్తోంది.

క్రేజీ హీరోయిన్ నోరాకు ఇప్పుడు కోట్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటీ హిందీతో పాటు తమిళ, తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. “బిగ్ బాస్ 9”, “ఝలక్ దిఖ్ లజా” వంటి రియాల్టీ షోలలో కూడా కనిపించి బుల్లితెర ప్రేక్షకుల మనసులను దోచుకుంది. “కిక్ 2” వంటి బ్లాక్ బస్టర్ హిందీ మూవీలో నటించింది. ఇక “సత్యమేవ జయతే” అనే సినిమాలో “దిల్బర్” అనే సాంగ్ లో ఆమె చేసిన డాన్స్ తో అసలు నోరాకు ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేదా? అని నోరు వెళ్లబెట్టేలా చేసింది. అలాగే మరింతగా ఫ్యాన్ బేస్ ను పెంచేసింది. ఇక తెలుగులో ఈ అమ్మడు ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన “బాహుబలి” ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేసింది. “మనోహరి” అనే సాంగ్ లో రెబల్ స్టార్ తో ఆడి పాడిన ముగ్గురు హీరోయిన్లలో నోరా కూడా ఒకరు. అయితే ఈ బ్యూటీ ఈ కలర్ ఫుల్ ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందు హుక్కా బార్ లో డ్యాన్సర్ గా పని చేసేదట.

1992లో కెనడాలో జన్మించిన నోరా కుటుంబ సభ్యులు మొరాకోలో నివసిస్తున్నారు. చిన్నతనం అంతా అక్కడే గడిపిన నోరా 5000 వేల సంపాదనతో ఇండియాకు వచ్చి, ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. స్వయంగా డ్యాన్స్ నేర్చుకున్న ఈ అమ్మడు అప్పట్లోనే బాగా డ్యాన్స్ చేసేదట. అదే స్కిల్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె మొదట్లో డాన్స్ నేర్పించేదట. అప్పట్లో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని కూడా నోరా దగ్గరే డాన్స్ నేర్చుకుందని తెలుస్తోంది. మొత్తానికి నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది ఈ అమ్మడు. సినిమాలతో పాటు డాన్స్ షోలకు కూడా జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 44 మిలియన్లు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నోరా క్రేజ్ ఏంటో.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు