Nithya Menen : పెళ్లికి రెడీ అయిపోయిన హీరోయిన్ ?

నిత్య మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “అలా మొదలైంది” సినిమా ద్వారా తెలుగు పేక్షకులకు పరిచయమైంది ఈ మలయాళ కుట్టి నిత్యమీనన్. అలా వరుస అవకాశాలు కొట్టేసిన ఈ బొద్దుగుమ్మ, ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేసింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్య ఎక్కడ గ్లామర్ షో కి తావివ్వలేదు.

ఇటీవల స్కైలాబ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిత్యామీనన్. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో మళ్లీ నిత్యామీనన్ ఫామ్ లోకి వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటించింది. ఇది ఇలా ఉండగా నిత్యామీనన్ పర్సనల్ విషయానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిత్యామీనన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం అందుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ హీరోను నిత్యమీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వీరిద్దరూ చిత్ర పరిశ్రమ లోకి రాకముందే ప్రేమించుకున్నట్లు కూడా టాక్. కానీ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఈ జంట ఉంచినట్లు సమాచారం. అయితే నిత్యామీనన్ పెళ్లికి ఇంట్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వార్త వైరల్ గా మారినట్లు తెలుస్తోంది. ఇక వీరి పెళ్లిపై ఆగస్టు లోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీవర్గాలు కోడై కూస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు