Naga Chaitanya : లక్ష్యం అదేనా..!

అగ్ర హీరోల కొడుకులను హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేయడం కొత్తేమీ కాదు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే పోటీని తట్టుకుని నిలదొక్కుకున్న వారు తక్కువ మంది. అలాగే స్టార్ హీరోలుగా ఎదిగిన వారు, యావరేజ్ హీరోగా ఆగిపోయిన వారు కూడా ఉన్నారు.

సినీ బ్యాగ్రౌండ్ ఉన్న అక్కినేని నాగ చైతన్య 2009 లోనే జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఏమాయ చేశావే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. దీని తర్వాత పలు సక్సస్ లు అందుకున్నా, స్టార్ హీరో రేంజ్ కు మాత్రం ఎదగలేకపోయాడని చాలా మంది అభిప్రాయం. “మజిలీ” “లవ్ స్టోరీ” “బంగర్రాజు” లాంటి హిట్ సినిమాల తర్వాత వరుస సినిమాలకు సైన్ చేస్తూ, బిజీ బిజీ గడుపుతున్నాడు.

ఇప్పటికే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” తో పాటు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో “లాల్ సింగ్ చద్దా” సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -

ఈ సినిమా రిలీజ్ కాక ముందే, తర్వాత చేయాల్సిన సినిమాలపై నాగ చైతన్య ఫోకస్ పెట్టేశాడు. నాగ చైతన్య ఇప్పటికే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, పరశురామ్, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో కూడా సినిమాలు చేస్తున్నట్టు గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. తాజా గా నాగ చైతన్య మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

“డీజే టిల్లు”తో సిద్ధు జొన్నలగడ్డకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విమల్ కృష్ణ ఇప్పుడు ఈ అక్కినేని హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. నాగ చైతన్యకు విమల్ కృష్ణ ఇప్పటికే స్టోరీ చెప్పినట్టు, దానికి చైతన్య ఇంప్రెస్ అయి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది.

అయితే స్టార్ హీరో అవ్వాలనే లక్ష్యంతోనే నాగ చైతన్య వరుసగా ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే, నాగ చైతన్య స్టార్ హీరో అయినట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు