OG : ఓజి డేట్ కి లక్కీ భాస్కర్! అంటే ఇక తప్పుకున్నట్టేనా?

OG : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “ఓజి” సినిమా కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొదలైనప్పటినుండే ఓ రేంజ్ లో ఉంటుందని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా కోసం పీకే ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని కన్నా ముందు సెట్స్ పై పవన్ కళ్యాణ్ వి రెండు సినిమాలున్నా కూడా ఓజి పైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలని విపరీతంగా పెంచేసింది. ఇక ఆ మధ్య సుజిత్, పవన్ కల్యాణ్ ఈ చిత్రానికి ప్రత్యేకంగా ‘క్రవ్ మగా’ అనే మార్షల్ ఆర్ట్ శిక్షణ తీసుకున్నారని, సినిమాకి అవసరమైన ప్రత్యేక సన్నివేశాలను షూట్ చేసేందుకు ఎంతగానో శ్రమించారని చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. కానీ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నది ఒకటే.. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో అని. ఇక పవన్ కల్యాణ్ ఏడాది ముందే పూర్తిగా రాజకీయాలలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు పూర్తయినా ఎప్పుడు వస్తారో చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉండగా ఓజి సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో సినిమా ఆ డేట్ కి రావడానికి సిద్ధమైంది.

Lucky Bhaskar for the release date of OG movie.. Will OG be postponed?

ఓజి డేట్ కి లక్కీ భాస్కర్…

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేయగా, ఇప్పటివరకు మరో అప్డేట్ లేదు. ఇక తాజాగా మరో క్రేజీ సినిమా ఆ డేట్ కి వస్తుందని అనౌన్స్ మెంట్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక లక్కీ భాస్కర్ ని వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లక్కీ భాస్కర్ పై అంచనాలు పెంచేసాయి.

- Advertisement -

ఓజి వాయిదా పడ్డట్టేనా?

అయితే లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 27న రిలీజ్ అంటూ ఓజి వాయిదా పడినట్టేనా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓజి (OG) నుండి ఇప్పటివరకూ మరే అప్డేట్ రాలేదు. పైగా పవన్ ఎన్నికల తర్వాత ఇంకా షూటింగ్ లు మొదలు పెట్టలేదు. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ఖచ్చితంగా సెప్టెంబర్ లో వస్తే, అసలు ఓజి కో పోటీగా మరో సినిమా రిలీజ్ కాదు. కానీ ఇప్పుడు నాగవంశీ లక్కీ భాస్కర్ ని కాన్ఫిడెంట్ గా అనౌన్స్ చేసాడంటే ఓజి రిలీజ్ పై నమ్మకం లేకనా అని నెటిజన్లు అంటున్నారు. చూస్తుంటే పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏది ఏమైనా ఫ్యాన్స్ కి కనీసం క్లారిటీ అయినా ఇవ్వండి అని సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు. ఇక ఓజి సినిమా లో గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ గా పవన్ OG లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఓజి సినిమాపై మళ్ళీ ఎప్పుడు మేకర్స్ అప్డేట్ ఇస్తారో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు