Janhvi Kapoor : చెర్రీతో మూవీకి జాన్వీ ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంటే?

Janhvi Kapoor

ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “గేమ్ చేంజర్” సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జూన్ లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి మరో కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి చెర్రీ రెడీ అవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ కొత్త సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. మరి RC16 కోసం జాన్వి కపూర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హాట్ బ్యూటీ జాన్వి కపూర్ ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేసింది. ఇప్పటికే ఈ బ్యూటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి పాన్ ఇండియా మూవీ “దేవర”లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాంచరణ్ 16వ సినిమాలో కూడా జాన్వినే హీరోయిన్ గా కన్ఫామ్ కావడం విశేషం. చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు ఫిక్స్ చేశారట మేకర్స్. అయితే రెండవ సినిమాకే ఈ ముద్దుగుమ్మ భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. “ఉప్పెన” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ హీరోగా RC16 చేయబోతున్నారు. లెజెండరీ రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ గా ఈ మూవీని రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడబోతున్నారని అంటున్నారు.

ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం చెర్రీ సరసన నటించేందుకు జాన్వి కపూర్ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. RC16 కోసం జాన్వీ ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తన ఖాతాలో వేసుకుంటుందని సమాచారం. ఇక తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరూ ఈ రేంజ్ లో పారితోషకం తీసుకోవట్లేదు. గత ఏడాది వరస సినిమాలు చేసిన శ్రీలీల కూడా కేవలం రెండు కోట్ల వరకే రెమ్యూనరేషన్ అందుకుంటుందట.

- Advertisement -

నిన్నగాక మొన్న టాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వి కపూర్ కు మాత్రం ఆరు కోట్ల పారితోషికమా? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆమె హిందీలో 3.5 కోట్ల పారితోషకం మాత్రమే అందుకుంటుందట. కానీ తెలుగులో మాత్రం డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం అనే విషయం తెలియదు గానీ ఆమె పారితోషకం విషయంలో బాలీవుడ్, టాలీవుడ్ కు మధ్య చూపిస్తున్న పక్షపాతం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు