Hi Nanna : ఆ పాపులర్ తెలుగు సీరియల్ కాపీ… ఇప్పుడు వంటలక్క ముఖచిత్రం ఏంటో?

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న “హాయ్ నాన్న” మూవీ రానే వచ్చింది. ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని చేస్తున్న మూవీ ఇదే కావడంతో “హాయ్ నాన్న” మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీతో డైరెక్టర్ శౌర్యువ్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఇక సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా ఈ సినిమాను చూడడానికి ఆసక్తిని కనపరిచారు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన “హాయ్ నాన్న” మూవీని వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో “హాయ్ నాన్న” మూవీ ఓ పాపులర్ తెలుగు సీరియల్ కాపీ అని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం టెలివిజన్లో ‘కార్తీక దీపం’ అనే సీరియల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఈ సీరియల్ కు ఎంతగా అడిక్ట్ అయ్యారంటే ఏకంగా సినిమాల్లో సైతం ‘కార్తీకదీపం’ సీరియల్ లోని ప్రధాన పాత్రలు వంటలక్క, డాక్టర్ బాబులను వాడుకునేంతగా. వీళ్ళిద్దరికి వచ్చినంత పాపులారిటీ స్టార్స్ కి కూడా ఉండదేమో అనిపించేంత. ఇక సీరియల్ సంగతి పక్కన పెడితే ‘హాయ్ నాన్న’ మూవీ అచ్చం ‘కార్తీకదీపం’లాంటి కథతోనే నడుస్తుంది అనే టాక్ నడుస్తోంది. ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ కి ఇద్దరు పిల్లలు ఉంటారు. అయితే ‘హాయ్ నాన్న’ మూవీలో మాత్రం ఒక్కతే పాప. అంతేకాకుండా కార్తీకదీపం స్టోరీ లో కొన్ని చిన్న మార్పులు చేసి ‘హాయ్ నాన్న’ మూవీని చేశారు అని అనిపిస్తోంది అంటూ సినీ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇప్పుడు వంటలక్క ముఖచిత్రం ఏంటో అంటూ ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.

సాధారణంగా సీరియల్ చూసినప్పుడు ఏంటి ఇంత ల్యాగ్ ఉంది? ఎలా చూస్తారు రా నాయన ఈ సీరియల్స్? చాలా ఓపిక కావాలి అని అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ మూవీని చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది అంటూ విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. ఇక విమర్శకుల నుంచి సినిమాకు నెగిటివ్ టాక్ వస్తోంది. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘హాయ్ నాన్న’ మూవీ రిలీజ్ కు ముందే నానికి ఈ మూవీ పై నమ్మకం లేదు అంటూ టాక్ నడిచింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ విమర్శకులు మాత్రం సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు. మరి ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు