Hi Nanna : కాక్ టెయిల్ పార్టీకి శృతి హాసన్ ఎంత వసూలు చేసిందో తెలుసా?

టాలీవుడ్ లో ప్రస్తుతం డిసెంబర్ ఫుల్ గా సినిమాలతో లోడ్ అయిపోయింది. ఈ మంత్ లో పలు సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసింది. అందులో ఎమోషనల్ కంటెంట్ తో రూపొందుతున్న ఒకే ఒక మూవీ “హాయ్ నాన్న”. నేచురల్ స్టార్ నాని హీరోగా, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, రీసెంట్ గా “హాయ్ నాన్న” టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఒకదాని వెంట ఒకటి వరుసగా రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.

క్రేజీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “హాయ్ నాన్న” మూవీలో “ఒడియమ్మ” అనే స్పెషల్ సాంగ్ కూడా ఉంది. పబ్ లో కాక్ టెయిల్ పార్టీకి సంబంధించిన ఈ సాంగ్ లో నానితో కలిసి శృతిహాసన్ చిందేసింది. ఈ సాంగ్ ను శృతిహాసన్, పాపులర్ సింగర్ చిన్మయి, తమిళ స్టార్ హీరో ధృవ్ విక్రమ్ కలిసి పాడారు. పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా “ఒడియమ్మ” సాంగ్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. “హాయ్ నాన్న” మూవీలోని ఈ కాక్ టెయిల్ పార్టీ సాంగ్ లో కనిపించడానికి శృతిహాసన్ ఏకంగా 90 లక్షలు వసూలు చేసిందట. ఈ పాటలో కాకుండా సినిమాలో కూడా మరో రెండు మూడు సన్నివేశాల్లో శృతిహాసన్ కనిపించనుంది. ఇలా మొత్తంగా కేవలం ఐదు నిమిషాల పాటు స్క్రీన్ పై కనిపించే శృతిహాసన్ ఏకంగా కోటి రూపాయలు ఛార్జ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

మరి ఈ బ్యూటీ సినిమాకు ఆ లెవెల్లో ఉపయోగపడుతుందా? అంటే మూవీ రిలీజ్ అయ్యేదాకా చెప్పలేం. అయితే శృతి హాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. కాబట్టి ఒకరకంగా ఈ బ్యూటీ ఆ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేయడం కూడా సబబే అంటున్నారు ఆమె అభిమానులు. కాగా తండ్రి కూతుర్ల అనుబంధం సెంటిమెంట్ తో రాబోతున్న ఈ మూవీకి హేషం అబ్దుల్ వహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో రానున్న “హాయ్ నాన్న” మూవీలో బేబీ కియారా ఖన్నా నాని కూతురుగా కనిపించబోతోంది. మరి డిసెంబర్ 7న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటున్న లేదా అనేది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు