Devara : దేవరతో పోటీకి సిద్ధమవుతున్న కన్నడ పాన్ ఇండియా మూవీ!

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” (Devara) పై పాన్ ఇండియా వైడ్ గా ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఫస్ట్ లుక్ మొదలైనప్పటినుండి టీజర్ ఇంకా లేటెస్ట్ గా ఫస్ట్ లిరికల్ సాంగ్ తో అంతకంతకు అంచనాలను పెంచుకుంటూ పోతున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ రవిచందర్ అందిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ తో ఏ రేంజ్ లో రచ్చ చేసాడో తెలిసిందే. త్వరలో రెండో సాంగ్ రిలీజ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే దేవర సినిమాను అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే దేవర కి పోటీగా మరో పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే అది తెలుగులో కాదు కన్నడలో.

Dhruv Sarja Martin Movie Clash With NTR Devara Movie

దేవరకి పోటీగా ధృవ్ సర్జా సినిమా…

ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర (Devara) సినిమాని దసరా కానుకగా థియేటర్లలో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తుండగా, ఈ సినిమాకు పోటీగా ఓ కన్నడ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతుంది. కన్నడ స్టార్ ధ్రువ సర్జా హీరోగా “మార్టిన్” అనే పాన్ ఇండియా యాక్షన్ చిత్రం తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే తాజాగా మార్టిన్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 11 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా దేవర తో గట్టి క్లాష్ కి రెడీ అయినట్లు తెలుస్తొంది. తెలుగులో ఈ సినిమాపై పెద్దగా ప్రభావం పడకపోయినా, కన్నడ, హిందీ భాషల్లో దేవర కలెక్షన్లకు గండి పడే అవకాశం ఉంది. ఇక ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కి ఏ.పీ. అర్జున్ దర్శకత్వం వహించగా, అర్జున్ సర్జా కథని అందించారు. ధృవ సర్జా ఈ చిత్రం లో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం పై కూడా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పట్లో వచ్చిన టీజర్ మార్టిన్ టీజర్ ఎంత హైప్ పెంచేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

- Advertisement -

ప్రమోషన్లతో హైపెక్కిస్తున్న దేవర..

ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, ఫస్ట్ పార్ట్ దసరా కి రిలీజ్ అవుతుండగా, రెండో పార్ట్ వచ్చే ఏడాది సమ్మర్ లో రానుంది. ఇక దేవర చిత్రం లో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీఖాన్ భైరా అనే పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తుండగా, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టైం చాకో, నరైన్, మురళి శర్మ, అభిమన్యు సింగ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిపోగా, మూడో భాగానికి సంబంధించిన షూట్లు కూడా కొన్ని పూర్తి చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే సినిమా బడ్జెట్ 200 కోట్లు ఎప్పుడో దాటిపోగా సినిమా పూర్తయ్యే సరికి 300 కోట్లు కావొచ్చని సమాచారం. ఇక దసరా వచ్చే వరకు ఇంకెన్ని సినిమాలు పోటీగా నిలుస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు