Salaar Release Trailer : అది ఇదిగాద్… అదే ఇది… ట్రైలర్ తో స్టోరీపై కన్ఫ్యూజన్

డైనోసార్ రచ్చ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన “సలార్” సెకండ్ ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతున్న తీరు చూస్తుంటే ఇంటర్నెట్ తగలబడిపోవడం ఖాయమేమో అనిపిస్తుంది. ఇదిలా ఉంటే రెండు ట్రైలర్లను చూసిన తర్వాత స్టోరీ ఏంటి అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. తాజాగా వచ్చిన ట్రైలర్లో పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ తనకు ఎంత పెద్ద సమస్య వచ్చినా సైన్యానికి కాకుండా ఒక్కడికే చెప్పేవాడు. వాడు వద్దనుకున్నది నాశనం చేసేవాడు, కావాలనుకున్నది తెచ్చి ఇస్తాడు అనే డైలాగ్ తో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఒక క్లారిటీ చేశారు. కథలు సుల్తాన్ పృథ్వీరాజ్ కాగా, ప్రభాస్ ఆ ఒక్కడు అనేది అర్థమవుతుంది. మిత్రుడు ఏది కోరుకున్న దేవా ఒక్కడే సైన్యమై యుద్ధం చేసి అతని కోరిక నెరవేరుస్తాడు. అయితే ట్రైలర్లు చెప్పిన మరో ఆసక్తికరమైన డైలాగ్ ప్రకారం ఈ ప్రాణ మిత్రులు ఇద్దరూ బద్ధ శత్రువులు అవుతారు. అయితే సినిమా అంతా వీళ్ళ శత్రుత్వం కారణంగా జరిగే ఫైట్స్ ఉంటాయని, శృతిహాసన్ కు హీరో తన బ్యాక్ గ్రౌండ్ ను వివరించే క్రమంలో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చెప్పుకొస్తాడని ఈ ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది.

కానీ గత ట్రైలర్ ను చూస్తే మాత్రం చిన్నప్పటి నుంచి వీరిద్దరూ ఫ్రెండ్స్ అని, పెద్దయ్యాక ఏవో కొన్ని కారణాలతో దూరమవుతారని, కానీ పృథ్వీరాజ్ కి సమస్య రావడంతో, ఖాన్సార్ సామ్రాజ్యంపై కొంతమంది దుండగులు విరుచుకుపడుతుండగా, వారిని ఊచకోత కోయడానికి తన మిత్రుడైన ప్రభాస్ ను రంగంలోకి దింపుతాడని అనిపించింది. ఇప్పటికే “సలార్” మూవీ ఖాన్సార్ అనే ఒక కల్పిత రాజ్యం మీద ఆధిపత్యం కోసం జరిగే యుద్ధమని మేకర్స్ ఎప్పుడో చెప్పేశారు. ఇలా ఈ రెండు ట్రైలర్ల మధ్య వచ్చిన ఈ కన్ఫ్యూజన్ కారణంగా సినిమా స్టోరీ ఏమై ఉంటుంది అనే విషయంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే అది ఇదిగాద్… అదే ఇది అనిపించేలా మాట్లాడుకుంటున్నారు నెటిజెన్లు. ఇంతకీ అసలు కథ ఏంటి ? అసలు ఈ ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం పెరిగేలా ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేశాడు? అసలు ట్విస్ట్ ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే డిసెంబర్ 22న మూవీ థియేటర్లలోకి వచ్చేదాకా ఎదురు చూడక తప్పదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు