Hrithik Roshan : ట్రెండ్ కొన‌సాగుతుందా

త‌మిళంలో ఘ‌న విజ‌యం సాదించిన విక్ర‌మ్ వేద ఆధారంగా హిందీలో కూడా ఈ చిత్రం అదే టైటిల్‌తో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో వేద‌గా హృతిక్ రోష‌న్‌, విక్ర‌మ్ గా సైఫ్ అలీఖాన్ న‌టించారు. 2017లో విడుద‌లైన విక్ర‌మ్ వేద చిత్రాన్ని తెర‌కెక్కించిన పుష్క‌ర్ గాయ‌త్రి హిందీ చిత్రాన్ని సైతం రూపొందించారు. ఈ చిత్రంలోని అల్కాహోలియా అంటూ సాగే పాట ఇటీవ‌లే యూట్యూబ్‌లో విడుద‌ల అయింది. ఆ పాట ట్రెండ్ సృష్టించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌ర్ 30న ఈ సినిమా విడుద‌ల‌వుతోంది. ఈ సినిమా కి కూడా బాయ్ కాట్ విక్ర‌మ్ వేద అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతోంది. గ‌తంలో కూడా సినిమా విడుద‌ల‌య్యే స‌మ‌యంలో బాయ్ కాట్ ట్రెండ్ కొన‌సాగింది.

తొలుత మే 29న లాల్‌సింగ్ చ‌ద్దా నిర్మాత‌లు ట్రైల‌ర్ విడుద‌ల చేసిన‌ప్పుడు సోష‌ల్ మీడియాలో అని ట్రెండింగ్‌ను ప్రారంభించారు. విడుద‌ల‌కు ముందు అమీర్‌ఖాన్ మూవీస్‌, క‌రీనా క‌పూర్ మూవీస్ Boycott అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. అదేవిధంగా బ్ర‌హ్మాస్త్ర సినిమాకి అదే కొన‌సాగింది. తాజాగా బాయ్‌కాట్‌ విక్ర‌మ్ వేద అని హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్‌ను ట్యాగ్ చేస్తున్నారు.

ఓవైపు బాయ్‌కాట్ ట్రెండ్ ని బాలీవుడ్ అంతా ముక్త‌కంఠంతో ఖండిస్తుంటే ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం భిన్నంగా స్పందించారు. సినిమాలు మాకు వ‌ద్దు అనే పిలుపు ఇవ్వ‌డం స‌రైందే అని పేర్కొన్నారు. కాలం చెల్లిన ఫార్ములాల‌తో సినిమాలు రూపొందిస్తుండ‌డం వ‌ల్లే బాలీవుడ్ చిత్రాలు అప‌జ‌యాల పాల‌వుతున్నాయ‌ని చెప్పారు. చాలా వ‌ర‌కు పాత క‌థ‌ల‌నే మార్చి జ‌నాల మీద‌కు వ‌దులుతుండ‌డం వ‌ల్ల‌నే ప్రేక్ష‌కులు విసిగిపోయి ఇలాంటి బాయ్‌కాట్ ట్రెండ్స్ తీసుకొస్తున్నారని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి విక్ర‌మ్ వేద సినిమా గ‌త సినిమాల మాదిరిగానే కొన‌సాగుతుందా లేక ట్రెండ్ సృష్టిస్తుందా అనేది సెప్టెంబ‌ర్ 30న తెలియ‌నుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు