Vaishnavi: బేబీ హీరోయిన్ వైష్ణవి సంచలన నిర్ణయం..!

వైష్ణవి చైతన్య.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అదృష్టం అంటే ఈ ముద్దుగుమ్మదే అని చెప్పవచ్చు. ఎక్కడ టిక్ టాక్ వీడియోలు.. ఎక్కడ యూట్యూబ్ వీడియోలు.. ఎక్కడి షార్ట్ ఫిలిమ్స్.. ఎక్కడి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ.. ఎక్కడో పాత బస్తి నుంచి వచ్చిన ఈ బేబీ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ లో తన మొదటి సినిమాతోనే సూపర్ పాపులారిటీని దక్కించుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో ఈమెకు తిరుగులేదని, ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చేస్తాయని అంతా అనుకున్నారు.

కానీ ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే ఉంది. అయితే అది కూడా హీరోయిన్ గా అనుకుంటే పొరపాటే..! ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుందట. ఏకంగా ఓ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ కు ఒప్పేసుకుందట. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో వైష్ణవి ఐటమ్ సాంగ్ చేయబోతుందని టాక్. మొదటగా ఈ సినిమాలో ఈమెని సెకండ్ హీరోయిన్ గా అనుకున్నారట.

కానీ చివరికి ఐటెం గర్ల్ గా చూస్ చేసుకున్నారట. ఈ ఆఫర్ ని కూడా బేబీ డైరెక్టర్ సాయి దగ్గరుండి మరి ఆమె చేత ఒప్పించి.. సైన్ చేయించాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న నెటిజెన్స్ తెలుగు పరిశ్రమలో అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంటుందనుకుంటే.. ఇలా ఐటెం సాంగ్ కి ఒప్పుకుందేంటని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు