Anshu Ambani: నేను చనిపోయాను అనుకున్నారు -అన్షు అంబానీ..!

అన్షు అంబానీ.. ఈ పేరు వినగానే ఎవరా అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు.. మన్మధుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ అప్పట్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. మహేశ్వరి అనే పాత్రలో అద్భుతంగా నటించింది. అలాగే ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో కూడా మెయిన్ హీరోగా నటించింది ఈ ముద్దుగుమ్మ. అంతటి క్రేజ్ సంపాదించుకున్న అన్షు అంబానీ చివరిగా 20 సంవత్సరాల క్రితం జై అనే సినిమాలో నటించింది.

ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్షు అంబానీ మాట్లాడుతూ..తాను సినిమాలలో కనిపించకపోవడం వల్ల తాను ఎక్కడికో వెళ్లిపోయానని.. మరి కొంతమంది ఏకంగా చనిపోయింది అని అనుకున్నారని.. ఈ కామెంట్స్ విన్నాక తనకు చాలా భయం వేసిందంటూ తెలిపింది.. ఆ సమయంలో తనని తాను ఆలోచించుకొని.. ఈ ఫీల్డ్ నుంచి ఎందుకు బయటికి వచ్చేశానా అని అనిపించిందని తెలిపింది. అయితే తాను ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు తనకు ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చాయని వెల్లడించింది.

అయితే తాను మన్మధుడు మూవీ సినిమా చేసే సమయంలో తన వయసు కేవలం పదహారేళ్ళని.. ఇక తెరమీద కనిపించాలనే కూడా కోరిక నెరవేరడం తో తిరిగి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయానని. అక్కడే తన చదువును మొత్తం పూర్తి చేశానని తెలిపింది. ప్రస్తుతం ఇప్పుడైతే చాలామంది హీరోయిన్లకు కొన్ని రకాల టీమ్ లు ఉన్నాయి.. కానీ అప్పట్లో తనతో పాటు తన తండ్రి మాత్రమే ఉండేవారని తెలిపింది. తాను బ్రిటిష్ ఇండియన్ అని..కానీ ఇంగ్లాండ్లో పుట్టినప్పటికీ తన పూర్వీకుల మూలాలు మొత్తం ఇండియాలో ఉన్నాయని తెలిపింది.

- Advertisement -

ఇండస్ట్రీలో కూడా తనకి పెద్దగా ఎవరు స్నేహితులు లేరని.. అప్పట్లో ఒక జాబ్ లాగా వచ్చి యాక్టింగ్ చేసి వెళ్లిపోయానని.. కానీ ప్రభాస్ మాత్రమే తనకు బాగా తెలుసు అని ..తన కూతురు బాహుబలి చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందని తెలిపింది అన్షు అంబానీ.. అప్పట్లో శ్రీయ, త్రిష, భూమిక, ఆర్తి అగర్వాల్ తెలుసు కానీ వారితో పెద్దగా టచ్ లో లేను అంటూ తెలిపింది.. రీసెంట్ గా గుంటూరు కారం, భగవంత్ కేసరి వంటి చిత్రాలను చూశానని తెలిపిన ఈమె..చివరిగా నాగార్జున తో పనిచేయడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని.. అవకాశం వస్తే ఎవరితోనైనా మళ్ళీ నటిస్తానంటూ తెలిపింది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు