తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు విడుదల చేస్తే.. నైజం ఏరియా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రతి సినిమాకు ఇక్కడి నుంచే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. దీంతో ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు పొందుతారు. దీని వల్ల డిస్ట్రిబ్యూషన్స్ కి కాస్త డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి వరకు సినిమాలకు నైజం హక్కులను ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకునే వారు. ఇటీవల దిల్ రాజుకు వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూటర్ గా పోటీ ఇస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నైజం హక్కులను వరంగల్ శ్రీను దక్కించుకున్నాడు. ఇక్కడే అసలైన సమస్య స్టార్ట్ అయింది. నైజం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ – 2 సినిమాలు నడుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ హవా తగ్గినా.. కేజీఎఫ్-2 జోష్ మాత్రం తగ్గలేదు. ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. దీంతో కేజీఎఫ్ -2 ను థియేటర్స్ నుంచి తొలగించడం లేదు. అయితే కేజీఎఫ్-2 నైజం డిస్ట్రిబ్యూబర్ గా దిల్ రాజు ఉన్నాడు.
దిల్ రాజుకు వరంగల్ శ్రీను ఈ మధ్య గతంలో పలు విభేదాలు కూడా వచ్చాయి. శ్రీను సినిమాకు స్క్రీన్స్ ఎలా ఇవ్వాలని దిల్ రాజు మొండిగా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ డిస్ట్రిబ్యూటర్స్ పంచాయతీ వల్ల మెగా స్టార్ ఆచార్య సినిమాకు నైజంలో థియేటర్స్ రావడం కష్టంగా మారింది. మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ.. స్క్రీన్స్ సంఖ్యపై ఇప్పటికీ స్పష్టత రాలేదట.
దీంతో ఆచార్య చిత్ర బృందం టెన్షన్ లో ఉందట. ఈ వ్యవహారంలో దిల్ రాజ్ వెనక్కి తగ్గడం కష్టమే అని తెలుస్తుంది. అయితే మెగా ఫ్యామిలీకి దిల్ రాజ్ సన్నిహితంగానే ఉంటాడు. అలాగే రామ్ చరణ్-శంకర్ మూవీకి దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ కారణాలతో దిల్ రాజు కొంత వరకు సానుకూలంగా ఉండే అవకాశం ఉందట. దీనిపై క్లారిటీ మాత్రం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. కాగ ఈ వ్యవహారం కొలుక్కి వచ్చి.. ఆచార్యకు ఎన్ని థియేటర్స్ వస్తాయో తెలియాలంటే.. మరో మూడు రోజులు ఆగాల్సిందే. ఆచార్య ముందు మరో గండం..!